ETV Bharat / sukhibhava

గోరింటాకుతో అరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది! - reasons to apply mehandi

గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పెళ్లిళ్లు, పండగలొచ్చాయంటే చాలు అతివలు తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. ఫారిన్​ సంస్కతి భారత్ ఇంట అడుగుపెట్టాక.. 'గోరింట' సంప్రదాయం కాస్త తగ్గిందే గానీ..ఒకప్పుడు పురుషులు కూడా ఈ మైదాకు ఎరుపునకు దాసోహులే. మరి గోరింటాకుకు అంతటి ప్రాధాన్యం ఎందుకు దక్కింది.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

the  benefits of applying mehandi or gorntaku on palms and foot
గోరింటాకుతో ఆరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!
author img

By

Published : Jul 3, 2020, 10:30 AM IST

'గోరింట పూసింది కొమ్మ లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది..' అన్న చందంగా మహిళల చేతుల్లో గోరింటాకు విరబూస్తుంది. ఏ పేరంటమైనా అతివల చేతులు, కాళ్లు గోరింటాకుతో పండిపోతాయి. వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి.. ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంతే కాదు.. ఆరోగ్యపరంగాను గోరింటాకుతో ప్రయోజనాలున్నాయి.

the  benefits of applying mehandi or gorntaku on palms and foot
గోరింటాకుతో ఆరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!

ఆరోగ్య సమస్యలకు చెక్..

  1. కాలేయ సంబంధ సమస్యల్ని నివారించడానికి, కామెర్ల వ్యాధి చికిత్సకు గోరింటాకు చెట్టు బెరడును ఉపయోగిస్తారు.
  2. చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది.
  3. గోరింటాకు పేస్ట్‌ను చేతులకు పెట్టుకోవడం వల్ల.. ఇది శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
  4. కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్లలో పుండ్లలా తయారవుతుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది.
  5. గాయాలైనప్పుడు, ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి కూడా గోరింటాకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
  6. పూర్వకాలంలో గోరింటాకును వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడేవారు. ఉదాహరణకి.. తలనొప్పి, కడుపునొప్పి, కాలిన గాయాలు.. ఇలా ఏ సమస్య అయినా సరే.. ఆ ప్రదేశంలో గోరింటాకు పేస్ట్‌ను రాసేవారు.. దీంతో క్రమంగా నొప్పి క్షీణించి సమస్య తగ్గిపోయేది. ఇది సహజసిద్ధమైంది కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.
  7. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను నయం చేయడంలో కూడా గోరింటాకు తోడ్పడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టుకు..

  • కొంతమందికి జుట్టు బాగా వూడిపోతుంటుంది. మరి, ఈ సమస్యను దూరం చేసి కొత్త జుట్టు రావడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. దీనికోసం 250 గ్రాముల ఆవనూనెలో 60 గ్రాముల గోరింటాకు వేసి వేడిచేయాలి. తర్వాత వడకట్టగా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు మళ్లీ పెరగడం మొదలవుతుంది.
  • నెలకోసారి గోరింటాకుతో తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే వెంట్రుకలు మెరుపు, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. చుండ్రు సమస్య కూడా దరిచేరదు.
  • జుట్టు తళతళా మెరిసిపోవాలంటే.. గోరింటాకు పేస్ట్‌ను తలకు పట్టించి అది ఆరేవరకు అంటే కనీసం మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో కడిగేసి.. జుట్టును పొడిగా ఆరబెట్టుకోవాలి. పడుకునే ముందు జుట్టుకు ఆయిల్ రాసుకుని, మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ అప్త్లె చేసుకుంటే సరి.. దీంతో జుట్టుకు మంచి రంగు, మెరుపు వస్తాయి.

గోరింట ఎర్రగా పండాలంటే...!

  • గోరింటాకుని రుబ్బేటప్పుడు కొంచెం చక్కెర, రెండు లవంగాలు వేయాలి. రుబ్బిన తర్వాత ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి పక్కన పెట్టాలి. ఓ అరగంట అయ్యాక గోరింటాకు పెట్టుకుంటే చక్కగా ఎర్రగా పండుతుంది.
  • అలాగే గోరింటాకు ఎండిన తరవాత, చక్కెర నిమ్మరసం కలిపిన మిశ్రమంలో ముంచిన దూదితో చేతిపైన అద్దాలి. అదేవిధంగా పెనంపై కొద్దిగా ఇంగువ వేడి చేసి, ఆ పొగను చేతులకు తగలనిచ్చినా గోరింటాకు ఎర్రగా పండుతుంది.
  • ఇక గోరింటాకు తీసేశాక లవంగ నూనెను చేతికి రాసుకోవడం వల్ల కూడా చక్కగా పండుతుంది.

ఇదీ చదవండి: నీళ్లు బాగా తాగితే సులువుగా బరువు తగ్గుతారట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.