ETV Bharat / sukhibhava

అలర్ట్​- ఈ లక్షణాలు ఉన్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే!

Symptoms Of Stones in Kidney : ప్రస్తుతం చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారి బాధ అంతా ఇంతా కాదు. అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? అవి ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ? అనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Symptoms Of Kidney Stones
Symptoms Of Kidney Stones
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 9:34 AM IST

Symptoms Of Stones in Kidney in Telugu: కిడ్నీలు.. శరీరంలోని వ్యర్థపదార్థాలను , విషపదార్థాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. అయితే ఈ బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి.. యూరిన్‌కు వెళ్లాలంటే మంట.. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. అసలు కిడ్నీలో రాళ్లు ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో చాలా మందికి తెలియదు. ఈ 8 లక్షణాలు ఉంటే మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే అని నిపుణులు అంటున్నారు! ఆ లక్షణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

రాళ్లు ఎలా ఏర్పడతాయి..: కిడ్నీలో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి. కాల్షియం అక్సినేట్‌, కాల్షియం ఫాస్పేట్‌. మూత్రంలో ద్రావణం, సాలిడ్‌ కంపోనెంట్‌ ఉంటుంది. సాలిడ్‌ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌ కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుంటాయి. సాలిడ్‌ కంపోనెంట్‌లు మూత్రంలో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న గుళికలుగా మారుతాయి. మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల తలెత్తే స్ఫటికాలు కిడ్నీలో రాళ్లకు దారితీస్తాయి. ఇవి మూత్రకోశంలో కదులుతుంటాయి కూడా. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల ఏర్పడే రాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన శరీరం ప్రోటీన్‌ను వినియోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్‌ యాసిడ్‌తోనూ రాళ్లు ఏర్పడొచ్చు.

కిడ్నీలో రాళ్లు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే:

1. నడుమునొప్పి, కడుపునొప్పి : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారిలో ఎక్కువగా నడుమునొప్పి, కడుపునొప్పి వస్తుంది. కొంతమందిలో ఈ నొప్పి కత్తితో పోటు పొడిచినట్లు ఉంటుందని అంటారు. మూత్రనాళంలో రాయి అటుఇటు కదిలిన్నప్పుడు నొప్పి మొదలవుతుంది. రాయి మూత్రనాళంలో అడ్డుపడి కిడ్నీపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కిడ్నీ నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. కిడ్నీలో పెద్ద రాళ్లు ఉంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది.

2. మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట : కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి లేదా మంటగా ఉంటుంది. దీన్ని 'డైసూరియా' అని అంటారు. రాయి మూత్రాశయం, బ్లాడర్‌ మధ్యలో ఉన్నప్పుడు ఈ నొప్పి వస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ల సమస్యను గుర్తించకపోతే.. అని యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

3. తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం : కిడ్నీలో రాళ్లు ఉన్న వారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ లక్షణం కనిపిస్తుంది.

4. మూత్రంలో రక్తం : కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారిలో మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని 'హెమటూరియా' అని పిలుస్తారు. రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఒక్కోసారి రక్తంలో కణాలు, మైక్రోస్కోప్ లేకుండా చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. దీన్ని 'మైక్రోస్కోపిక్ హెమటూరియా' అని అంటారు.

మీ పిల్లలు సరిగా చదవట్లేదా? కారణాలు ఇవేనట - సెట్ చేయాల్సింది మీరే!

5.మూత్రం దుర్వాసన : ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో మూత్రం వాసన రాదు. కానీ, కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే మూత్రం నురుగుతో పాటు దుర్వాసన వస్తుంది. యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడూ కూడా మూత్రం ఇలానే ఉంటుంది. బ్యాక్టీరియా కారణంగా యూరిన్​ దుర్వాసన వస్తుంది.

6. కొద్దిగా మూత్ర విసర్జన చేయడం : మూత్రపిండాలలో కొన్నిసార్లు పెద్ద రాళ్లు మూత్ర నాళంలో చిక్కుకుపోతాయి. దీని వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరగదు. మూత్ర ప్రవాహాన్ని రాళ్లు అడ్డుకుంటాయి. దీంతో వాష్‌రూమ్‌కు వెళ్లిన ప్రతి సారీ కొద్ది మొత్తంలో మూత్రం బయటకు విసర్జితం అవుతుంది.

చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!

7. వికారం, వాంతులు : మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి వికారం, వాంతుల లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయి. దీని వల్ల నొప్పి కూడా ఎక్కువగా బాధ పెడుతుంటుంది.

8. చలి జ్వరం: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారిలో చలి జ్వరం లక్షణాలను కనిపిస్తాయి. ఎందుకంటే కిడ్నీలో ఉండే రాళ్లు మూత్ర నాళాన్ని అడ్డుగా ఉంటాయి. దీని వల్ల మూత్రం బయటకి విసర్జితం కాకుండా ఉంటుంది. రాళ్లు అడ్డుపడటం వల్ల మూత్రం తిరిగి కిడ్నీలోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కి దారి తీస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల చలి జ్వరం వస్తుంది.

చలికాలంలో మీ జుట్టు డల్​గా ఉంటుందా? - ఈ టిప్స్‌ పాటిస్తే సిల్కీ హెయిర్​ గ్యారెంటీ!

తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.