శరీరంలో అతిపెద్ద భాగమైన లివర్.. జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి (5శాతానికి) మించి ఉంటే ఆ స్థితిని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. దీంతో కాలేయం పనితీరు దెబ్బతింటుంది.
ఫ్యాటీ లివర్ వస్తే ఏమవుతుంది?
ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. దాని పనితీరులో సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో (Liver Disease Symptoms) చర్మం పసువు రంగులోకి మారుతుంది.
శరీరంలో మోతాదుకు మించి విటమిన్ ఏ ఉండటమూ లివర్‌పై ప్రభావం చూపుతుంది. చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నా కాలేయ సమస్యలు వస్తాయి.
లక్షణాలు..
- చలిలోనూ చమటలు రావడం
- అధికంగా గురక రావడం
- కడుపు నొప్పి
- గ్యాస్ సమస్యలు
ఎందువల్ల వస్తుంది?
మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్.. ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు (Fatty Liver Causes). తీసుకునే ఆహారం, అలవాట్ల కారణంగానూ లివర్ చెడిపోతుంది. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు దీని బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తగ్గాలంటే ఎలా?
ఈ వ్యాధికి (Fatty Liver Treatment) మందుల కన్నా.. బరువు తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, షుగర్ అదుపు చేసుకోసుంటే అధికంగా ప్రయోజనం ఉంటుంది. మద్యం కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చిందని తేలితే.. ముందు మందు మానేయాలి. లేదంటే లివర్ చెడిపోతుంది.
మద్యం అలవాటు లేకున్నా ఫ్యాటీ లివర్ వచ్చినవారిలో.. డయాబెటిస్ ఉంటే దానిని అదుపులో పెట్టుకోవాలి. కొవ్వు ఎక్కువగా (Fatty Liver Diet) ఉన్న ఆహార పదార్థాలను తీసుకోరాదు. ముఖ్యంగా మసాలా పదార్థాలు, చల్లిని వస్తువులకు దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి. ఇలాంటి జాగ్రత్తలతో ఫ్యాటీ లివర్ ఉన్నవారి కాలేయం మెరుగుపడటమే కాక, లేనివారిలో ఈ వ్యాధి రాకుండే ఉండేందుకు దోహదం చేస్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఈ పాలు తాగితే వద్దన్నా సరే నిద్ర పడుతుంది!