ETV Bharat / sukhibhava

నిత్యం యవ్వనంగా ఉండాలా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి - old age weakness diet

Old Age Weakness: వయసు మీద పడటం అనివార్యమే కావచ్చు. మరి ఎంత బాగా వృద్ధాప్యం వస్తోందో ఎప్పుడైనా గమనించారా? ముసలితనం ముంచుకురావటంలో బాగోగులేంటని ఆశ్చర్యపోకండి. మనమంతా పైకి చెప్పుకునే వయసు, శరీరంలో కొనసాగే వయసు వేరు మరి. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు తెల్లబడటం, చర్మం ముడతల వంటి వృద్ధాప్య ఛాయలు తెలుస్తూనే ఉంటాయి. కానీ ఏదైనా అనుకోని సమస్య బయటపడేంతవరకు లోపల తలెత్తే మార్పుల గురించి తెలియనే తెలియదు. కాబట్టే వైద్యశాస్త్రం వృద్ధాప్య ప్రక్రియను అర్థం చేసుకోవటం, దీన్ని జయించటంపై దృష్టి సారించింది. ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించింది.

Old Age Weakness
Old Age Weakness
author img

By

Published : May 17, 2022, 7:16 AM IST

Old Age Weakness: కాలంతో పాటు వయసు మీద పడటం సహజమే. అయితే వృద్ధాప్యం అందరికీ ఒకేలా రాదు. కొందరిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవ్వచ్చు. కొందరికి వయసు నెమ్మదిగా మీద పడొచ్చు. ఎవరినైనా తొలిసారి చూసినప్పుడు అసలు వయసు కన్నా కొందరు చిన్నగానూ, కొందరు బాగా వయసు మీద పడినట్టుగానూ కనిపించటం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం కాలాన్ని బట్టి.. అంటే పుట్టిన రోజుతో లెక్కించే వయసు (క్రోనోలాజికల్‌), శారీరకంగా సంభవించే (బయోలాజికల్‌) వృద్ధాప్యం భిన్నంగా ఉండటమే. వృద్ధాప్య ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. దీన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఒకే వయసువారైనప్పటికీ ఏ ఇద్దరిలోనూ శారీరక వయసు సమానంగా ఉండదు. ఆయుష్షు దగ్గర్నుంచి ఆరోగ్యంగా, హాయిగా జీవించటం వరకు అన్నీ వేరుగానే ఉంటాయి. వయసు మీద పడటాన్ని ప్రధానంగా జన్యువులే నిర్ణయించినా అంతా వీటి మీదే ఆధారపడి లేదు. మన ఆయుష్షులో 10-30% వరకే జన్యువులు ప్రభావం చూపుతాయి. మిగతాదంతా మన రోజువారీ వ్యవహారాల మీదే ఆధారపడి ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆహారం, వ్యాయామం, మానసిక ఒత్తిడి, పొగ, మద్యం అలవాట్ల వంటి పాత్రే ఎక్కువ. దురదృష్టవశాత్తూ మనలో చాలామంది దీన్ని అంగీకరించరు. అలవాట్లను ఉన్నపళంగా మార్చుకోవటానికి మనసు ఒప్పుకోదు కదా. కాలంతో ముడిపడిన వయసు ఒకే దిశలో సాగుతుంది. ఇది తగ్గటమంటూ ఉండదు. అదే శారీరక వయసు వేగంగా పెరగొచ్చు. నెమ్మదిగానూ సాగొచ్చు. కావాలంటే దీన్ని వెనక్కి మళ్లించుకునే అవకాశమూ ఉందని వైద్యశాస్త్రం చెబుతోంది. అంటే దీనర్థం 150 ఏళ్ల వరకు జీవించొచ్చని కాదు, బతికింతనంత కాలం హాయిగా, ఆరోగ్యంగా గడిపేలా చూసుకోవచ్చని.

శారీరక వయసును ఎలా నిర్ధరిస్తారు?: వృద్ధాప్య ప్రక్రియలో టెలోమేర్స్‌, డీఎన్‌ఏకు అంటుకునే రసాయనాలు (మెథీలేషన్‌) కీలక పాత్ర పోషిస్తాయి. టెలోమేర్స్‌.. వీటిని ఒకరకంగా క్రోమోజోమ్‌ తోకలని అనుకోవచ్చు. వీటి పొడవును బట్టి శారీరక వయసును నిర్ధరించొచ్చు. క్రోమోజోమ్‌లకు ఒక చివర అంటుకుపోయే న్యూక్లియోటైడ్లనే టెలోమేర్స్‌ అంటారు. ఇవి క్రోమోజోమ్‌ల చివర్లు క్షీణించకుండా, సమీపంలోని క్రోమోజోమ్‌లకు కలిసిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా కణాలు ఎంతవరకు జీవించాలో, ఎప్పుడు చనిపోవాలో నిర్దేశిస్తాయి. వయసు మీద పడుతున్నకొద్దీ టెలోమేర్స్‌ పొడవు తగ్గుతూ వస్తుంటుంది. శారీరక వయసు ఎక్కువగా ఉన్నవారిలో ఇవి పొట్టిగా ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టెలోమేర్స్‌ పొట్టిగా ఉన్నవారికి అకాల మరణం, నాడీ క్షీణత జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

డీఎన్‌ఏ మెథీలేషన్‌: మన జన్యువుల్లోని డీఎన్‌ఏలో ‘ఎపిజనెటిక్‌ కోడ్‌’ నిక్షిప్తమై ఉంటుంది. డీఎన్‌ఏ పనితీరును నిర్దేశించే సూచనలు, సంకేతాలు ఇచ్చేది ఇదే. దీన్ని ఒకరకంగా కణాన్ని నడిపించే ‘ఆపరేటింగ్‌ సిస్టమ్‌’ అనుకోవచ్చు. డీఎన్‌ఏ అణువులకు కొన్ని మిథైల్‌ రసాయనాలు అంటుకొని పోతుంటాయి. దీన్నే డీఎన్‌ఏ మెథీలేషన్‌ అంటారు. ఇవి జన్యుక్రమం మీద ఎలాంటి ప్రభావం చూపవు గానీ మంచి ఆరోగ్యానికి తోడ్పడే జన్యువులను పనిచేయించగలవు. లేదూ జబ్బులకు దారితీసే జన్యువులు పనిచేయకుండా ఆపగలవు. వయసు మీద పడుతున్నకొద్దీ డీఎన్‌ఏకు అంటుకుపోయే రసాయనాలు కలగలిసిపోయి, ఒక క్రమంలో ఏర్పడుతుంటాయి. దీన్ని బట్టి శారీరక వయసును నిర్ధరించొచ్చు. అంటే 60 ఏళ్లలో కనిపించాల్సిన రసాయన మార్పులు ఎవరికైనా 40 ఏళ్లలోనే కనిపించాయనుకోండి. పుట్టినతేదీ ప్రకారం వారికి 40 ఏళ్లే అయినా శారీరకంగా 60 ఏళ్లు మీద పడ్డాయని అనుకోవచ్చు.

కొత్త పరీక్షలు వస్తున్నాయి: శారీరక వయసును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు కొత్త కొత్త పరీక్షలనూ రూపొందిస్తున్నారు. ఇటీవల యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన పరీక్ష ఇలాంటిదే. ఇది చాలా తేలికైంది. ట్యూబులో లాలాజలాన్ని సేకరించి, ప్రయోగశాలకు పంపిస్తే చాలు. ఇది ఎపిజనెటిక్‌ కోడ్‌ను విశ్లేషించటం ద్వారా శారీరక వయసును నిర్ధరిస్తుంది. టెలోమేర్స్‌ పొడవును గుర్తించే పరీక్షలూ ఉన్నాయి. ఇవి కాస్త ఖరీదైన పరీక్షలే గానీ చవకగా అందుబాటులోకి తీసుకురావటానికీ ప్రయత్నిస్తున్నారు. సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌ సగటుతోనూ శారీరక వయసును నిర్ధరించే అవకాశముంది. ఇప్పటికే కొన్నిచోట్ల దీన్ని అనుసరిస్తున్నారు. జబ్బులు ఆరంభం కావటానికి చాలాకాలం ముందే వీటిల్లో ఆనవాళ్లు కనిపిస్తాయి.

వృద్ధాప్యాన్ని ఇలా జయించొచ్చు: వృద్ధాప్యాన్ని ఆపలేక పోవచ్చు గానీ శారీరకంగా త్వరగా వృద్ధులు కాకుండా చూసుకోవచ్చు. ఆహార, విహారాలను మార్చుకోవటం ద్వారా దీన్ని సాధించొచ్చు. మంచి జీవనశైలి మూలంగా టెలోమేర్స్‌ పొడవు పెరుగుతున్నట్టు, వృద్ధాప్యం వెనక్కి మళ్లుతున్నట్టు అధ్యయనాలూ సూచిస్తున్నాయి మరి.

శాకాహారం ఎక్కువగా తినాలి: చిన్న, మధ్య వయసులో వీలైనంత ఎక్కువగా శాకాహారం తినటం ద్వారా వయసు త్వరగా మీద పడకుండా చూసుకోవచ్చు. ఐజీఎఫ్‌-1 (ఇన్సులిన్‌ లైక్‌ గ్రోథ్‌ ఫ్యాక్టర్‌-1) శారీరక వయసు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని పనితీరును మనం తినే ఆహారంలోని ప్రొటీన్‌ ఉత్తేజితం చేస్తుంది. అధిక ప్రొటీన్‌ ఆహారంతో.. అంటే ప్రొటీన్‌ ద్వారా 10% కన్నా తక్కువ కేలరీలు లభించే ఆహారం తిన్నవారితో పోలిస్తే- 20% కేలరీలు లభించే ఆహారం తీసుకునేవారిలో అకాల మరణం ముప్పు 74% ఎక్కువగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీలో నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. శాకాహారంతో ఎక్కువ ప్రొటీన్‌ లభించేలా చూసుకుంటే ఈ వ్యత్యాసం దాదాపు పూర్తిగా కనిపించకుండా పోవటం గమనార్హం. అయితే 65 ఏళ్లు పైబడ్డవారిలో ఎక్కువ ప్రొటీన్‌ తీసుకున్నా అకాల మరణం ముప్పు 28% తగ్గుతుండటం విచిత్రం. దీనికి కారణం లేకపోలేదు. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నకొద్దీ కండరాలు క్షీణిస్తుంటాయి. ఇక్కడే ప్రొటీన్‌ ఆదుకుంటోంది. శాకాహారంతోనే కాదు, మాంసాహారంతో లభించే మంచి ప్రొటీన్‌ అయినా వృద్ధాప్యంలో మేలు చేస్తుంది.

ఉపవాసం మేలు: అప్పుడప్పుడు ఉపవాసం చేయటమూ వయసును వెనక్కి మళ్లిస్తుంది. ఉపవాసంతో శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఇది వృద్ధాప్యం త్వరగా ముంచుకురాకుండా చేస్తుంది. ఐదు రోజుల పాటు కేవలం 4,500 కేలరీలు మాత్రమే తీసుకున్నవారిలో శారీరక వయసు తగ్గినట్టు, వీరు అదే వయసు గలవారితో పోలిస్తే రెండున్నరేళ్లు చిన్నగా కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తరచూ ఉపవాసం చేసినవారిలో రోగనిరోధక వ్యవస్థ కూడా మరింత చురుకుగా పనిచేస్తుండటం గమనార్హం. ఉపవాసం చేసినప్పుడు శరీరం కాస్త ఒత్తిడికి లోనవుతుంది. దీనికి ప్రతిస్పందించే ప్రయత్నంలో మెరుగవటానికి ప్రయత్నిస్తుంది. దీన్నే హార్మెటిక్‌ ప్రభావమంటారు. వ్యాయామం మాదిరిగానే ఉపవాసమూ శరీరం మరమ్మతు కావటానికి, సజావుగా పనిచేయటానికి తోడ్పడుతున్నట్టు కనిపిస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. ఉపవాసంతో ఒనగూరే ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతోంది కూడా. వీరికి గుండెజబ్బుల ముప్పు 50%, క్యాన్సర్‌ ముప్పు 30%, మధుమేహం ముప్పు 75% వరకు తగ్గుతున్నట్టు తేలింది.

వ్యాయామం కీలకం: వయసు వెనక్కి మళ్లటానికి వ్యాయామం బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా స్వల్పకాలం అధిక వేగం, శ్రమతో.. తర్వాత నెమ్మదిగా వ్యాయామం చేసే పద్ధతి మరింత ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే హెచ్‌ఐఐటీ వ్యాయామ పద్ధతి అంటారు. చేసే వ్యాయామం అదే అయినా కాసేపు వేగంగా చేయటం దీనిలోని ప్రత్యేకత. ఉదాహరణకు- వ్యాయామ సైకిల్‌ తొక్కుతున్నారనుకోండి. ముందు 30 సెకండ్ల పాటు చాలా వేగంగా, ఎక్కువ శ్రమతో సైకిల్‌ తొక్కి.. రెండు, మూడు నిమిషాల సేపు నెమ్మదిగా, తక్కువ శ్రమతో సైకిల్‌ తొక్కటం అన్నమాట. ఇలాగే పుషప్స్‌, జంపింగ్‌ జాక్స్‌ వంటివి ఏవైనా చేయొచ్చు. ఉన్నట్టుండి అత్యధిక వేగంతో వ్యాయామం చేసినప్పుడు శరీరం కాస్త దిగ్భ్రాంతికి లోనవుతుంది. శరీర సామర్థ్యం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. తర్వాత నెమ్మదించి, కుదురుకుంటుంది. కండర పోచలు తిరిగి వృద్ధి చెందుతాయి. మెరుగవుతాయి. మందంగా తయారవుతాయి. కణాల్లో శక్తి కేంద్రకమైన మైటోకాండ్రియా మరింత చురుకుగా పనిచేస్తుంది. వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) వంటి చర్యలు తగ్గుముఖం పడతాయి. మూడు నెలల పాటు హెచ్‌ఐఐటీ వ్యాయామ పద్ధతిని పాటించినా శరీర పటుత్వం, కణాలు ఇన్సులిన్‌కు స్పందించే గుణం గణనీయంగా పెరుగుతున్నట్టు మేయోక్లినిక్‌ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. వ్యాయామంతో జీపీఎల్‌డీ1 అనే ప్రొటీన్‌ కోడింగ్‌ జన్యువు సైతం ఉత్తేజితమవుతుంది. ఇది విషయ గ్రహణ సామర్థ్యం పుంజుకునేలా చేస్తుంది. ఒకరకంగా వ్యాయామం శరీరాన్ని నవ యవ్వనం దిశగా మళ్లిస్తుందన్నమాట.

కంటి నిండా నిద్ర: వయసు విషయంలో నిద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క రాత్రి సరిగా నిద్ర పట్టకపోతేనే ముఖం పీక్కుపోయినట్టు కనిపిస్తుంది. ఇక రోజూ నిద్రలేమితో సతమతమవుతుంటే శరీరం మీద ఇంకెంత ప్రభావం పడాలి? పెద్దవారికి సగటున రోజుకు రాత్రిపూట 7 గంటలు నిద్ర అవసరం. రోజుకు 5 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి ఆయుష్షు తగ్గే ముప్పు ఎక్కువ. అలాగని ఎక్కువసేపు పడుకుంటే ఎక్కువ లాభం ఉంటుందనుకుంటున్నారేమో. 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రపోయేవారికీ ఆయుష్షు తగ్గే ప్రమాదముంది. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవటం మెదడుకూ మేలు చేస్తుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు మెదడులోని ద్రవం తరంగాలుగా ప్రవహిస్తూ మృత కణాలను తొలగిస్తున్నట్టు బోస్టన్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీల పరిశోధకులు గుర్తించారు. ఇది వృద్ధాప్యంలో మెదడులో అమీలాయిడ్‌ బీటా గార పోగుపడటం వల్ల వచ్చే అల్జీమర్స్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెదడు కణజాలాన్ని విశృంఖల కణాల బారి నుంచి సంరక్షించటానికి నికోటినమైడ్‌ అడినైన్‌ డైన్యూక్లియోటైడ్‌ (ఎన్‌ఏడీ) అనే ప్రొటీన్‌ తోడ్పడుతుంది. ఇది మెదడు కణాలు త్వరగా క్షీణించకుండానూ కాపాడుతుంది. జీవ గడియారం సజావుగా పనిచేయటంలోనూ పాలు పంచుకుంటుంది. నిద్ర సరిగా పట్టకపోవటానికి ఎన్‌ఏడీ ఉత్పత్తి తగ్గటం కారణం కావొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. దీన్ని పెంచుకోవటానికి మంచి మార్గాలు ఉపవాసం, వ్యాయామం. ఇప్పుడు ఎన్‌ఏడీ ఉత్పత్తిని పెంచే మాత్రలూ అందుబాటులో ఉన్నాయి.

ప్రభావ కారకాలు: డీఎన్‌ఏ మెథీలేషన్‌, శారీరక వయసు మీద చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్ని సానుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా పనిచేస్తాయి.

.

ఇదీ చదవండి: నూనె రాస్తే జుట్టు రాలదా? వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.