ETV Bharat / sukhibhava

నిద్రలేచిన వెంటనే బద్ధకంగా ఉంటుందా? ఈ సింపుల్​ ఆసనాలతో అంతా సెట్​! - సింపుల్​ యోగాసనాలు ఈజీ

Simple Yoga Asanas : మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నవారే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు. ప్రతి మనిషికి ఈ రెండు ఆరోగ్యాలు చాలా ముఖ్యం. మానసికంగా బాలేకపోయినా, శారీరకంగా ఆరోగ్యంగా లేకపోయినా కష్టమే. అయితే యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. యోగాలో కొన్ని సులువైన ఆసనాలను తరచూ సాధన చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. అవేంటంటే?

starting your day with simple yoga asanas

author img

By

Published : May 14, 2023, 7:10 PM IST

Easy Yoga Asanas : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారాయి. విద్య, కెరీర్ అనే చట్రంలో పడి పొద్దున లేస్తే రాత్రి వరకు అందరూ పరుగులు పెడుతున్నారు. విశ్రాంతి లేని షెడ్యూల్స్​తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీని వల్ల రోగాల బారిన పడుతున్నారు. సరైన జీవన శైలిని పాటించకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. వృద్ధులతో పాటు చిన్న వయసు వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి శారీరక, మానసిక సమస్యలను తరిమికొట్టాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటూ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండటం చాలా అవసరం. యోగా, కసరత్తులు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా సాధన చేయడానికి చాలా మంది ఈ రోజుల్లో తీరిక ఉండట్లేదు. బిజీ షెడ్యూల్స్ వల్ల యోగా చేయాలనే కోరిక ఉన్నా చాలా మంది దానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. అదే సమయంలో ఆసనాలు చాలా క్లిష్టంగా ఉంటాయనే ఉద్దేశంతోనూ కొంతమంది యోగా చేయడానికి అనాసక్తి చూపిస్తుంటారు. ఈ అపోహలపై ప్రముఖ యోగా గురువు, బెంగళూరుకు చెందిన మీనూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.

starting your day with simple yoga asanas
ధ్యానం

Simple Yoga Asanas : యోగాలో కఠినమైన ఆసనాలు ఉన్నప్పటికీ, అనేక సులువైన ఆసనాలు కూడా ఉన్నాయని మీనూ వర్మ చెప్పారు. వీటిని తరచూ సాధన చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. "యోగాలో సులువైన ఆసనాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని స్ట్రెచింగ్స్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీని వల్ల మానసికంగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాలను రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ఆసనాలు చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు" అని మీనూ వర్మ పేర్కొన్నారు. నిపుణులు చెప్పిన ఆ సులువైన యోగా ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

త్రికోణాసనం:

త్రికోణాసనం
  • ఈ ఆసనం వేయాలంటే ముందు నిటారుగా నిల్చోవాలి.
  • రెండు కాళ్ల పాదాల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
  • మోకాళ్లను నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత ముందుకు చూస్తూ రెండు చేతులను భుజాలకు సమానంగా ఎత్తాలి.
  • ఇప్పుడు కుడి కాలును కుడి వైపునకు తిప్పాలి. శ్వాసను వదులుతూ చేతులను అదే పొజిషన్​లో ఉంచి, కుడి వైపు మెల్లిగా తిరగాలి.
  • అనంతరం చేతులను సాధ్యమైనంతగా కిందకు వంచి కుడి కాలి పాదాన్ని కుడి చేతి వేళ్లతో తాకేందుకు ప్రయత్నించాలి.
  • ఆ సమయంలో ఎడమ చేతిని సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఎడమ చేతిని గాలిలో ఉంచాలి.
  • ఈ భంగిమలో సాధారణ శ్వాస తీసుకుంటూ 10 నుంచి 30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మళ్లీ యథాస్థితికి వచ్చి.. ఇదే భంగిమను తిరిగి ఎడమ వైపు చేయాలి.

తడాసనం:

తడాసనం
  • ఈ ఆసనం వేసేవారు ముందు నిటారుగా నిల్చోవాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
  • శ్వాస తీసుకుంటూ రెండు చేతులను సమానంగా పైకి లేపాలి.
  • ఆ తర్వాత చేతులను నమస్కార భంగిమలో ఒక దగ్గరకు కలపాలి.
  • ఇప్పుడు గాలిని వదిలి.. మళ్లీ శ్వాస తీసుకోవాలి.
  • అనంతరం మునివేళ్లపై నిల్చొని చేతులను పైకి చాచి ఒకచోట కలిపి పట్టుకోవాలి. ఈ భంగిమలో అర నిమిషం వరకు ఉండొచ్చు.
  • ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని.. తిరిగి భంగిమను పునరావృతం చేయాలి. ఇలా 10 నుంచి 15 సార్లు ఈ ఆసనాన్ని సాధన చేయాలి.

ఉత్తనాసనం:

ఉత్తనాసనం
  • ఈ ఆసనంలో ముందు నిటారుగా నిల్చోవాలి.
  • ఎక్కువగా శ్వాస తీసుకొని రెండు చేతులను సమానంగా పైకి లేపాలి.
  • ఇప్పుడు రెండు చేతులతో ఇరు కాళ్ల పాదాలను తాకే ప్రయత్నం చేయాలి.
  • రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. తలను కూడా పాదాల వరకు వంచాలి.
  • మోకాళ్లు, వెన్నెముకను మాత్రం వంచొద్దు. ఈ భంగిమలో 20 నుంచి 30 సెకన్ల పాటు ఉన్నాక తిరిగి పూర్వ స్థితికి చేరుకోవాలి.

బాలాసనం:

బాలాసనం
  • యోగా మ్యాట్ మీద వజ్రాసనంలో మాదిరిగా మోకాళ్ల మీద కూర్చొని తలను నేలకు ఆన్చాలి.
  • రెండు కాళ్ల పాదాలు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆ తర్వాత దీర్ఘ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందు వైపునకు చాచాలి.
  • అనంతరం గాలిని వదులుతూ నడుము నుంచి పూర్తిగా ముందు వైపు వంగాలి.
  • ఈ పొజిషన్​లో చేతులకు విశ్రాంతినిస్తూ భూమికి ఆన్చాలి.
  • ఈ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండి, ఆ తర్వాత యథాస్థితికి చేరుకోవాలి.

మార్గరి ఆసనం:

మార్గరి ఆసనం
  • మార్గరి ఆసనంలో వజ్రాసనంలో మాదిరిగా మోకాళ్ల మీద కూర్చోవాలి.
  • ఆ తర్వాత ముందుకు వంగి, చేతులను నేలకు ఆన్చాలి.
  • మోకాళ్లు, రెండు భుజాలు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ భంగిమలో శరీరం చూడటానికి ఒక బల్ల ఆకారంలో ఉంటుంది.
  • ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకొని నడుము కింది భాగం వైపు ఒత్తిడిని పెంచాలి.
  • ఈ భంగిమలో శరీరం చూడటానికి ఆంగ్ల అక్షరం C మాదిరిగా ఉంటుంది.
  • గాలి వదిలేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఆకాశం వైపు పైకి ఎత్తాలి.

ఈ ఆసనాలన్నింటినీ వేసేందుకు సుమారు అరగంట సమయం పడుతుంది. ఈ ఆసనాలను రోజూ సాధన చేస్తే కండరాలపై ఉండే ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. శరీరంలో శక్తి తిరిగి పుంజుకుంటుంది. దీని వల్ల బద్ధకం కూడా మాయమవుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి పై యోగాసనాలు చాలా దోహదపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.