ETV Bharat / sukhibhava

నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే మీకు ఈ లోపమున్నట్లే! - నిద్రలో కాళ్లు తిమ్మిర్లు

Leg Cramps While Sleeping: మీకు నిద్రపోతున్న సమయంలో కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా..? ఆ.. ఏం కాదులే అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కాళ్ల తిమ్మిర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి దీనికి కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Leg Cramps While Sleeping
Leg Cramps While Sleeping
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 10:15 AM IST

Reasons for Leg Cramps While Sleeping: రాత్రి నిద్రపోతున్న సమయంలో చాలామందికి కాళ్లు తిమ్మిర్లుగా ఉంటాయి. ఈ సమస్య కారణంగా నిద్ర కూడా సరిగా పట్టదు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది దీనిని లైట్​ తీసుకుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే.. ఈరోజు పని ఎక్కువ చేశామని ఇంకొందరు అనుకుని.. అసలు ఇది సమస్యే కాదని దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు. మరికొద్దిమంది మాత్రం శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుని దానికి అలవాటు పడిపోతారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యేది. కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే అప్రమత్తమయ్యి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు కాళ్లలో తిమ్మిర్ల వెనుక కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కాళ్ల తిమ్మిర్లు రావడానికి కారణాలు: కాళ్ల తిమ్మిర్లు అనేక కారణాల వల్ల వస్తాయి. అందులో కొన్ని చూస్తే.. శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం, కండరాల సంబంధిత సమస్యలు, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, దీర్ఘకాలిక వ్యాధులు.. కాళ్ల తిమ్మిర్లకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా వీటికి శరీరంలో కొన్ని విటమిన్లు లోపించడమే కారణమని స్పష్టం చేస్తున్నారు.. ఇంతకీ ఆ విటమిన్లు ఏంటంటే..

రోజూ ఎంతసేపు నడుస్తున్నారు? - ఈ లెక్క ప్రకారం నడవకపోతే ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!

విటమిన్-డి..: రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్ల సమస్య విటమిన్ డి లోపం వల్ల కూడా రావచ్చని నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే అది నేరుగా ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా విటమిన్ డి లోపం ఉంటే అది డోపమైన్‌ను ప్రభావితం చేస్తుంది. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఉదయం సూర్యకాంతిలో కొద్దిసేపు గడపాలి. అలాగే విటమిన్-డి లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉదా.. గుడ్లు, చేపలు( సాల్మన్, మాకేరెల్, సార్డిన్ చేపలలో ), పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పండ్లు వంటివి తీసుకోవాలి..

మహిళలు, ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? ముప్పు తప్పదంటున్న నిపుణులు!

విటమిన్-బి: శరీరంలో విటమిన్-బి లోపిస్తే రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయడానికి ఆహారంలో యాపిల్, ఆరెంజ్, కివి, పెరుగు, జున్ను, అరటిపండ్లు, బఠానీలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి. మాంసాహారులైతే చికెన్, సాల్మన్, ట్యూనా చేపలు తీసుకోవాలి.

కాల్షియం..: శరీరంలో కాల్షియం లోపించడం వల్ల కూడా రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అంతే కాకుండా కండరాల సమస్యలు, నాడీ వ్యవస్థ సమస్యలు.. ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే.. పాలు, చీజ్, పెరుగు, బాదం లాంటివి తీసుకోవాలి.

దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్​తో రిజల్ట్​ పక్కా!

ఐరన్..: ఐరన్ లోపం ఉన్నా కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా..శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, గింజలు, కిడ్నీ బీన్స్, శనగలు, బెల్లం మొదలైనవి తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్​ఫాస్ట్​లో ఈ కాంబినేషన్స్​ ట్రై చేయండి!

కాపర్ బాటిల్స్​లో వాటర్ తాగుతున్నారా? - అయితే మీ లివర్​ డేంజర్​ జోన్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.