ETV Bharat / sukhibhava

రొమ్ము క్యాన్సర్​ జన్యువులను ఇక జయించవచ్చు! - రొమ్ముక్యాన్సర్‌ పరీక్షలు

రొమ్ముక్యాన్సర్‌ బాధితులకు జన్యు పరీక్షలు చేయటం ఇటీవల అధికమైంది. క్యాన్సర్‌ జన్యు పరీక్షలు ఎవరికి అవసరం? పాజిటివ్‌గా తేలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీరిలో క్యాన్సర్‌ భిన్నంగా ఉంటుందా? చికిత్సలో ఏవైనా తేడాలుంటాయా? అనే విషయాలపై అవగాహన చాలా అవసరం.. రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా ఇలాంటి సందేహాలపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

breast cancer
reasons for breast cancer
author img

By

Published : Oct 4, 2022, 9:58 AM IST

రొమ్ముక్యాన్సర్‌ ముప్పు కారకాలు అనగానే అధిక బరువు, శ్రమ అంతగా చేయకపోవటం, బిడ్డకు చనుబాలు పట్టకపోవటం, సంతానలేమి, వయసు మీద పడటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. ఎక్కువ మందిలో ఇవే క్యాన్సర్‌కు కారణమవుతున్న మాటా నిజమే. కానీ కొందరికి కొన్ని జన్యువులు వంశ పారంపర్యంగానూ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. రొమ్ముక్యాన్సర్‌ బాధితుల్లో 5% నుంచి 10% మంది ఇలాంటివారే.

మనం మార్చటానికి వీలులేని ముప్పు కారకాల్లో జన్యువులు ఒకటి. వీటి విషయంలో మనం చేయగలిగిందేమీ లేదు. అయినా భయపడాల్సిన పనిలేదు. జన్యువులున్నా అందరిలా హాయిగా జీవించొచ్చు. నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. సంతానాన్ని కనొచ్చు. ఎందుకంటే జన్యువులు ఉన్నప్పటికీ క్యాన్సర్‌ రావాలనేమీ లేదు. తల్లికి జన్యు మార్పులున్నా అవి పిల్లలకు కచ్చితంగా సంక్రమించాలనీ లేదు. కాకపోతే ముప్పు ఎక్కువగా ఉంటుందంతే. ఒకవేళ పిల్లలకు జన్యువులు సంక్రమించినా ఇప్పుడు వీటి గురించి మనకు బాగా తెలుసు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. కాబట్టి మానసికంగా కుంగి పోవాల్సిన అవసరం లేదు. జీవనశైలి మార్పులతోనే చాలావరకు క్యాన్సర్‌గా మారకుండా చూసుకునే మార్గం లేకపోలేదు.

బ్రాకా జన్యువులే ప్రధానం
వంశపారంపర్యంగా సంక్రమించే రొమ్ముక్యాన్సర్‌లో ఆయా జన్యువులను బట్టి ముప్పు ఆధారపడి ఉంటుంది. ఇవి డీఎన్‌ఏ మీద విపరీత ప్రభావం చూపుతాయి. కణస్థాయిలో పనిచేసి క్యాన్సర్‌ మార్పులను తెచ్చిపెడతాయి. రొమ్ముక్యాన్సర్‌కు దారితీసే జన్యువుల్లో ప్రధానమైనవి బ్రాకా1, బ్రాకా2 జన్యువులు. ఇవి గలవారికి జీవితకాలంలో 50-85% క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది. అంతేకాదు, 15-30% మందిలో అండాశయ క్యాన్సర్‌కూ దారితీయొచ్చు.

ఈ జన్యు మార్పులు ఆటోసోమల్‌ డామినెంట్‌ పద్ధతిలో సంక్రమిస్తుంటాయి. అంటే కణాల్లో మార్పు చెందిన జన్యువు ప్రతి ఒకటి ఉన్నా కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. రొమ్ముక్యాన్సర్‌కు దారితీసే జన్యువులు తల్లి నుంచి, తండ్రి నుంచి.. ఎవరినుంచైనా సంక్రమించొచ్చు. అయితే తల్లి నుంచే ఎక్కువగా సంక్రమిస్తుంటాయి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే- వీటితో ముప్పు పెరుగుతుంది తప్ప నేరుగా క్యాన్సర్‌ తలెత్తదని. అప్పటికీ నివారణ మార్గం మన చేతుల్లోనే ఉంటుందని తెలుసుకోవాలి.

ఇతర జన్యువులు: బ్రాకా1, బ్రాకా2లే కాదు.. ఇతరత్రా జన్యువుల మార్పులూ రొమ్ముక్యాన్సర్‌కు దారితీయొచ్చు. కాకపోతే వీటి పాత్ర చాలా తక్కువ. క్యాన్సర్‌ ముప్పు తీవ్రతను బట్టి వీటిని మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. పీఏఎల్‌బీ2, పీటెన్‌, టీపీ53 జన్యువులతో ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏటీఎం, సీడీహెచ్‌1, బీఆర్‌ఐపీ1లతో ముప్పు ఒక మాదిరిగా.. చెక్‌2, ఎన్‌బీఎన్‌, ఎన్‌ఎఫ్‌1, ఎస్‌టీకే11 జన్యువులతో తక్కువగా ఉంటుంది.

నాలుగు రకాలు
కొన్ని రొమ్ముక్యాన్సర్లు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి స్త్రీ హార్మోన్లకు ఎక్కువగా స్పందిస్తుంటాయి. క్యాన్సర్‌ కణాల వెలుపలి గోడల మీదుండే గ్రాహకాలు వీటిని గ్రహిస్తుంటాయి. వీటి ఆధారంగా రొమ్ముక్యాన్సర్‌ను నాలుగు వర్గాలుగా విభజించొచ్చు. ఎవరికి ఎలాంటి చికిత్స బాగా పనిచేస్తుంది? ఎలా నివారించు కోవచ్చు? అనేవి తెలుసుకోవటానికివి వీలు కల్పిస్తాయి. రొమ్ముక్యాన్సర్‌ జన్యు పరీక్షలు ఎవరికి అవసరమన్నదీ వీటితో నిర్ణయిస్తారు.

ల్యూమినల్‌ ఎ: ఇందులో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల గ్రాహకాలు పాజిటివ్‌గా గల కణితులుంటాయి. కానీ హెచ్‌ఈఆర్‌2 నెగెటివ్‌గా ఉంటుంది. ఇలాంటి క్యాన్సర్లు హార్మోన్‌ చికిత్సకు బాగా స్పందిస్తాయి.

ల్యూమినల్‌ బి: ఇందులో ఈస్ట్రోజెన్‌ గ్రాహకం పాజిటివ్‌గా.. ప్రొజెస్టిరాన్‌ గ్రాహకం, హెచ్‌ఈఆర్‌2 పాజిటివ్‌గా ఉంటాయి. వీటికి కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. హార్మోన్‌ చికిత్స, హెచ్‌ఈఆర్‌2 మీద పనిచేసే చికిత్సలూ మేలు చేయొచ్చు.

హెచ్‌ఈఆర్‌2 పాజిటివ్‌: ఇందులో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ గ్రాహకాలు నెగెటివ్‌గా ఉంటాయి. కానీ హెచ్‌ఈఆర్‌2 పాజిటివ్‌గా ఉంటుంది. ఇలాంటి కణితులకు కీమోథెరపీ, హెచ్‌ఈఆర్‌2 మీద పనిచేసే చికిత్సలు ఉపయోగపడతాయి.

ట్రిపుల్‌ నెగెటివ్‌: ఇందులో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల గ్రాహకాలతో పాటు హెచ్‌ఈఆర్‌2 కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. వీటికి కీమోథెరపీ బాగా ఉపయోగపడుతుంది.

పరీక్ష ఎవరికి?
బ్రాకా1, బ్రాకా2 జన్యువులు గలవారిలో ఎక్కువగా ట్రిపుల్‌ నెగెటివ్‌ రకం రొమ్ము క్యాన్సర్‌ వస్తుంటుంది. అందువల్ల 50 ఏళ్లలోపు ట్రిపుల్‌ నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్‌ వచ్చినవారికి జన్యు పరీక్ష తప్పనిసరి. ముందుగా కోర్‌ బయాప్సీ చేసి.. తర్వాత ఈఆర్‌, పీఆర్‌, హెచ్‌ఈఆర్‌2 పరీక్షలతో ఎలాంటి రకం క్యాన్సరన్నది నిర్ధరిస్తారు. ట్రిపుల్‌ నెగెటివ్‌ ఉన్నట్టయితే బ్రాకా1, బ్రాకా2 పరీక్ష చేయిస్తారు.

అలాగే ఇంట్లో ఎవరైనా చిన్నవయసులో (45 ఏళ్ల లోపు) రొమ్ము క్యాన్సర్‌ బారినపడ్డా.. సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్‌ వచ్చినా.. ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది క్యాన్సర్‌ బారినపడ్డా.. మగవారిలో తండ్రికి గానీ సోదరులకు గానీ రొమ్ముక్యాన్సర్‌.. హైగ్రేడ్‌ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చినా వంశపారంపర్య జన్యు మార్పులు ఉండొచ్చని అనుమానించాలి. ఇంతకుముందు మనదగ్గర రొమ్ముక్యాన్సర్‌ జన్యు పరీక్ష అంతగా అందుబాటులో ఉండేది కాదు. ఖర్చూ ఎక్కువగానే అయ్యేది. ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. కొన్ని బీమా కంపెనీలూ దీనికి అంగీకరిస్తున్నాయి. కాబట్టి అవసరమైనప్పుడు జన్యు పరీక్షలు చేయించుకోవటమే మంచిది.

ఏంటీ ప్రయోజనం?

క్యాన్సర్‌ కారక జన్యువులను ముందే కనుక్కుంటే సరైన చికిత్సను నిర్ణయించుకోవటానికీ.. అలాగే శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే అనుబంధ చికిత్సకూ వీలుంటుంది. సాధారణంగా ముందు కీమోథెరపీ ఇచ్చినప్పుడు సర్జరీ అనంతరం కణితిలో ఎలాంటి క్యాన్సర్‌ కణాలు కనిపించకూడదు. దీన్నే పాథలాజికల్‌ కంప్లీట్‌ రెస్పాన్స్‌ అంటారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎక్కువకాలం జీవిస్తారు. అందుకే ట్రిపుల్‌ నెగెటివ్‌ రకం క్యాన్సర్‌ గలవారికి ముందు కీమోథెరపీ ఇచ్చి, తర్వాత సర్జరీ చేస్తుంటారు.

గతంలో బాగా ముదిరిన క్యాన్సర్లకే సర్జరీకి ముందు కీమో ఇచ్చేవారు. ఇప్పుడు ట్రిపుల్‌ నెగెటివ్‌, హెచ్‌ఈఆర్‌2 నెగెటివ్‌ రకం క్యాన్సర్లలో తొలిదశలోనే.. అంటే కణితి చిన్నగా ఉన్నా కూడా ముందుగానే కీమో ఇచ్చేస్తున్నారు. ట్రిపుల్‌ నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్‌ గలవారికి ‘కార్బోప్లాటిన్‌’ అనే ప్లాటినం ఆధారిత కీమోథెరపీ మందు బాగా ఉపయోగపడుతుందని కొత్త మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. బ్రాకా1, బ్రాకా2 జన్యువులున్నట్టు తెలిస్తే సర్జరీకీ ముందే దీన్ని ఇస్తే ఎంతో మేలు చేస్తుంది. చికిత్సలకు క్యాన్సర్‌ బాగా స్పందిస్తుంది.

  • ట్రిపుల్‌ నెగెటివ్‌ క్యాన్సర్‌ బాధితులకు చికిత్స పూర్తయ్యాక ఒకప్పుడు మందులు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు కొత్తగా ఓలాపారిబ్‌ అనే మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఏడాది వరకు వాడుకోవాలి. ఇది బ్రాకా1 జన్యు మార్పులు గలవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్‌ తిరగబెట్టకుండా చూస్తుంది. కాకపోతే ఇప్పుడు దీని ధర ఎక్కువగా ఉంది. మున్ముందు ధర తగ్గే అవకాశముంది.
  • జన్యు పరీక్షలు చేయటం వల్ల మరో ప్రయోజనం మరో రొమ్ములో, అండాశయాల్లో క్యాన్సర్‌ ముప్పునూ నివారించుకోవటం. బ్రాకా జన్యువులు పాజిటివ్‌గా ఉంటే అండాశయ క్యాన్సర్‌ తలెత్తే ముప్పు ఎక్కువ. అందువల్ల చిన్నవయసులో ట్రిపుల్‌ నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్‌తో పాటు బ్రాకా జన్యువులు గలవారు ముందే అండాశయాలు, ఫలోపియన్‌ ట్యూబులు తీయించేసుకుంటే అండాశయ క్యాన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు. అయితే వీటిని తీసేయించు కోవటం 35-40 ఏళ్లవారికే బాగా ఉపయోగపడుతుంది. 45 ఏళ్లు దాటాక పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పుకోవచ్చు.

తీరులో తేడాలు
జన్యుపరంగా వచ్చే క్యాన్సర్‌ చిన్న వయసులో ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి 35 ఏళ్లలోనే బయటడొచ్చు. అయితే చాలామంది ఇంత చిన్న వయసులో క్యాన్సరేంటని పెద్దగా పట్టించుకోరు. రొమ్ముల్లో ఏవైనా మార్పులు తలెత్తినా అనుమానించరు. కణితులను మామూలు గడ్డలుగానే భావిస్తుంటారు. కొన్నిచోట్ల డాక్టర్లు సైతం అంత తీవ్రంగా పరిగణించరు. 'చిన్న వయసే కదా, మామూలు గడ్డలే కావొచ్చు' అని భావిస్తుంటారు. పైగా చిన్నవయసులో.. ముఖ్యంగా రొమ్ముకణజాలం మందంగా గలవారిలో మామోగ్రామ్‌ పరీక్షలో క్యాన్సర్‌ స్పష్టంగా కనిపించదు. దీంతో క్యాన్సర్‌ను పోల్చుకోవటం కష్టమై పోతుంటుంది.

ఇలా రెండు రకాలుగా.. క్యాన్సర్‌ను అనుమానించటం, నిర్ధరించటంలో ఆలస్యం జరగుతోంది. ఫలితంగా క్యాన్సర్‌ వేగంగా ముదిరిపోతుంటుంది. ఎందుకంటే జన్యువులతో పుట్టుకొచ్చే కణితులు అతి వేగంగా పెరుగుతుంటాయి. క్యాన్సర్‌ రహిత కణితులు (ఫైబ్రడినోమా) నెమ్మదిగా నెలలు, సంవత్సరాల కొద్దీ పెరుగుతూ వస్తుంటాయి. అదే క్యాన్సర్‌ కణితులైతే వారాలు, నెలల్లోనే పెద్దగా అవుతాయి. కాబట్టి చిన్నవయసులో క్యాన్సర్‌ మార్పులను గమనించినా, కణితులు చాలా వేగంగా పెరుగుతున్నా వెంటనే జన్యుమార్పులు ఉండొచ్చని అనుమానించాలి.

ఆడ పిల్లలు జాగ్రత్తగా..
రొమ్ముక్యాన్సర్‌ జన్యువులు ఉన్నట్టు తేలితే కుటుంబ సభ్యులకూ సంక్రమించొచ్చనే భయం వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. అయితే చిన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయొద్దు. అలా చేస్తే పిల్లలు మానసికంగా కుంగిపోయే ప్రమాదముంది. 18 ఏళ్ల వయసు వచ్చాక ఒకసారి జన్యు పరీక్ష చేయించాలి. ఒకవేళ జన్యుపరీక్ష పాజిటివ్‌గా వస్తే అప్పట్నుంచే రొమ్ముల తీరుపై అవగాహన కలిగించాలి.

  • ప్రతి నెలా నెలసరి వచ్చాక ఏడో రోజున రొమ్ములను నిశితంగా గమనించుకోవాలి (స్వీయ పరీక్ష). రొమ్ముల్లో కొత్తగా ఏవైనా మార్పులొచ్చాయా? ఆకారం మారిందా? చేత్తో తడిమినప్పుడు గడ్డల వంటివి తగులుతున్నాయా? ఎక్కడైనా సొట్ట పడిందా? చను మొనల నుంచి స్రావాలేవైనా వస్తున్నాయా? అనేవి చూసుకోవాలి. స్వీయ పరిశీలనతో పాటు ఆర్నెల్లకు లేదా ఏడాదికి ఒకసారైనా డాక్టర్‌ను సంప్రదించి, రొమ్ముల పరీక్ష చేయించుకోవాలి.
  • 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు రొమ్ము అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంఆర్‌ మామోగ్రామ్‌ పరీక్ష చేయించాలి. ఎందుకంటే చిన్నవయసువారికి మామూలు మామోగ్రామ్‌ అంతగా ఉపయోగపడదు.
  • 30 ఏళ్లు దాటిన తర్వాత ఏటా ఎంఆర్‌ మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షను నెలసరి మొదలయ్యాక ఏడో రోజు నుంచి 15వ రోజు లోపే చేయాలి.
  • ఎంఆర్‌ మామోగ్రామ్‌ బాగా ఖరీదైన పరీక్ష అనుకుంటే మామోగ్రామ్‌ విత్‌ టోమోసింథసిస్‌ పరీక్ష చేయించుకున్నా చాలు.

రొమ్ములు తీసేయాల్సిన అవసరం లేదు
క్యాన్సర్‌ జన్యువులు ఉన్నట్టు తేలగానే కొందరు ముందు జాగ్రత్తగా రొమ్ములు తీసేసుకోవటం చూస్తున్నాం. అప్పట్లో హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ ఇలాగే రొమ్ములను తీయించుకోవటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అందరికీ అంత తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరమేమీ లేదనే చెప్పుకోవచ్చు. ముందస్తు పరీక్షలతో నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఆందోళనకు గురికావొద్దు. జీవనశైలి మార్పులను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. హార్మోన్ల భర్తీ చికిత్సలేవీ తీసుకోకూడదు. పెళ్లి అయినవారు కాన్పు తర్వాత విధిగా బిడ్డకు చనుబాలు పట్టాలి. మద్యం జోలికి వెళ్లకూడదు. దీని అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలతో రొమ్ముక్యాన్సర్‌ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు.

ముందస్తు సర్జరీలు
బ్రాకా1 పాజిటివ్‌ గలవారు వీలైనంత త్వరగా (21-25 ఏళ్లలోపు) పెళ్లి చేసుకోవాలి. తొలి సంతానాన్ని 30 ఏళ్ల ముందే కనేలా చూసుకోవాలి. పిల్లలు చాలని అనుకున్నప్పుడు 35-40 ఏళ్ల వయసులో ట్యూబెక్టమీ చేయించుకునేటప్పుడే అండాశయాలను, పలోపియన్‌ గొట్టాలను తొలగించుకోవటం మంచిది (రిస్క్‌ రెడ్యూజింగ్‌ సాల్పింగో-ఊఫోరెక్టమీ). అదే బ్రాకా2 జన్యుమార్పులు గలవారైతే 40-45 ఏళ్ల వయసులో దీన్ని చేయించుకోవచ్చు. గర్భసంచి తొలగించుకోవాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: భోజనం చేతితోనే తినాలా? స్పూన్లు వాడితే ఇబ్బందా?

మధుమేహంతో​ ఇబ్బంది పడుతున్నారా?.. పెరుగు, గుడ్లు తినేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.