ETV Bharat / sukhibhava

చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 12:14 PM IST

Pneumonia Causes : చలి పెరిగిపోతోంది.. పిల్లల నుంచి వృద్ధుల దాకా జాగ్రత్తగా ఉండాల్సిన కాలమిది. లేకపోతే కొన్ని సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా న్యూమోనియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ న్యూమోనియో అంటే ఏమిటి? దాని ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

Pneumonia
Pneumonia Causes

Pneumonia Symptoms and Causes : శీతాకాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో.. న్యూమోనియా ప్రమాదకరమైనది. ముందే అప్రమత్తం కావడం ద్వారా.. నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇంతకీ న్యూమోనియా(Pneumonia) అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి ? దీని ద్వారా ఎవరికి ఎక్కువ ప్రమాదం? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

న్యూమోనియా అంటే (What is Pneumonia) : ఇది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. లంగ్స్​లో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులుంటాయి. సాధారణంగా మనం గాలి పీల్చుకొన్నప్పుడు ఈ గదులలో ఆక్సిజన్ నిండుతుంది. అదే న్యూమోనియా వచ్చిన వ్యక్తికి మాత్రం.. ఆ గదులలో గాలి బదులు బ్యాక్టీరియల్ వైరస్​తో నిండిన ద్రవపదార్థం చేరుతుంది. దీంతో.. గాలి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. తీసుకునే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది.

లక్షణాలు..

  • చలితో కూడిన 102పైన డిగ్రీల జ్వరం
  • తీవ్రమైన దగ్గు, కఫం
  • ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టం
  • ఆయాసం, తీవ్రమైన నీరసం
  • ఆహారం తీసుకోకపోవడం
  • కొందరిలో వికారం, వాంతులు
  • అలసట

న్యూమోనియా రావడానికి కారణాలివే..

న్యూమోనియా అనేది పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వల్ల వస్తుంది. అంటే.. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఇవి ఇతర వ్యక్తుల ద్వారా కానీ.. హాస్పిటల్ ద్వారా ఎక్కువగా మానవ శరీరంలోకి చేరుతాయి. అందులో ముఖ్యమైనవి చూస్తే..

  • స్ట్రెప్టోకోకస్ : చిన్నపిల్లల్లో వచ్చే అత్యంత సాధారణమైన బాక్టీరియా ఆధారిత న్యూమోనియా ఇది. శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారు దీని బారినపడతారు.
  • మైకోప్లాస్మా : సాధారణంగా 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు, రద్దీగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి ఎక్కువగా సోకుతుంది. ఇది పెద్దగా ప్రభావం చూపదు.
  • సూడోమోనాస్ : ఈ న్యూమోనియా సుదీర్ఘకాలం హాస్పిటల్​లో ఉండడం వల్ల సోకే అవకాశం ఉంటుంది.
  • లెజియోనెల్లా : ఇది ప్రమాదకరమైనది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. కలుషితమైన నీటికి వల్ల వ్యాప్తి చెందుతుంది.
  • క్లేబ్సియెల్లా : ఇది ఇతరుల నుంచి కాకుండా.. మన శరీరంలోని పేగులలో ఉండే ఒక రకమైన బాక్టీరియా కారణంగా తయారవుతుంది. పేగులలో ఉన్నంత వరకూ ఇబ్బంది లేదు. పేగుల నుంచి బయటపడి ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందితే మాత్రం ప్రమాదకారిగా మారుతుంది.
  • వైరస్​తో, ఫంగస్​తో : వైరస్​తోపాటు ఫంగస్​తో కూడా కొన్ని రకాల న్యూమెనియా మనిషి శరీరంలోకి చేరుతుంది.

How to Prevent Dengue Fever Telugu : మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం

న్యూమోనియా ఎవరికి సోకుతుందంటే..

  • ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న రోగులకు
  • ఆస్తమా, దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీవోపీడీ) ఉన్న రోగులకు
  • ధూమపానం చేసే వారికి.. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నవారికి..
  • హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, క్యాన్సర్‌, అవయవ మార్పిడి రోగులకు వచ్చే అవకాశం ఉంటుంది.
  • న్యూమోనియా ఏ వయస్సు వారికైనా వ్యాపించే ప్రమాదముంది. ముఖ్యంగా 2 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు హై-రిస్క్ కేటగిరీలో ఉంటారు.

న్యూమోనియా అంటువ్యాధా?

ఈ వ్యాధి రావడానికి కారణమయ్యేవన్నీ అంటువ్యాధి కారకాలే. అంటే అవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈజీగా వ్యాపిస్తాయి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు.. కారకాలు గాలిలో కలిసిపోతాయి. వాటిని ఇతరులు పీల్చడం ద్వారా వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ వైరస్​, బాక్టీరియా నేలమీద, వస్తువుల మీద ఉంటే.. వాటిని తాకినప్పుడు కూడా వ్యాప్తి చెందుతాయి. వాతావరణంలో ఉండే ఫంగస్​ల ద్వారా కూడా ఈ వ్యాధి రావచ్చు. అయితే.. ఫంగస్​ల కారణంగా వచ్చే న్యూమోనియా అంటువ్యాధి కాదు.

Seasonal diseases: సీజనల్ వ్యాధులతో.. జరంత జాగ్రత్త

Milk With Ghee Benefits : గ్లాసు పాలు+ స్పూన్ నెయ్యి.. కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో.. కీళ్ల నొప్పులు దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.