ETV Bharat / sukhibhava

అలర్ట్ - మీరు ఈ ఆహారం తింటున్నారా? - ఆ సామర్థ్యం డౌన్​! - ఆహార పదార్థాలలో పురుగుమందు అవశేషాలు

Pesticides In Food Reducing Sperm Count : మీరు తినే ఆహార పదార్థాలకు.. మీకు సంతానం కలగడానికి మధ్య లింకు ఉందన్న సంగతి మీకు తెలుసా? నేటి ఆధునిక యుగంలో తీసుకుంటున్న పలు ఆహార పదార్థాల ద్వారా.. పురుషుల్లో ఆ శక్తి తగ్గిపోతోందట! మరి.. అవేంటి? నివారణ చర్యలేంటి?? అన్నది ఇప్పుడు చూద్దాం.

Pesticides In Food Reducing Sperm Count
Pesticides In Food Reducing Sperm Count
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 12:38 PM IST

Pesticides In Food Reducing Sperm Count : మనం తీసుకునే ఆహారం(Food) మీదనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నది తెలిసిందే. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు సరైన మోతాదులో అందినప్పుడే హెల్దీగా ఉంటాం. కానీ.. మనం తినే తిండి ద్వారా మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోందని మీకు తెలుసా? మీ కుటుంబ వారసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మీరెక్కడైనా విన్నారా? సైంటిస్టులు జరిపిన తాజా పరిశోధనలో విస్తుపోయే విషయం వెల్లడైంది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These Foods Reducing Sperm Count : "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్" అనే సంస్థ ఇటీవల ఓ పరిశోధన చేపట్టింది. పురుగుమందులతో పండిన ఆహారం తినే పురుషుల శరీరంలో.. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఈ రీసెర్చ్ వెల్లడించింది. పెస్టిసైడ్స్ వాడిన ఆహారాన్ని తినడం ద్వారా.. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునే పురుషుల్లో.. వీర్యకణాలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

అంతేకాదు.. ఈ పరిస్థితికి కారణమవుతున్న పంటల్లో.. అత్యంత చెత్తవాటితో ఓ లిస్టు కూడా తయారు చేశారు. వీటికి "డర్టీ డజన్" అనే పేరు పెట్టారు. వీటిల్లో ఎక్కువ పురుగుమందుల అవశేషాలు కలిగి ఉన్నట్టు తేల్చారు. మొత్తం 46 ఆహార పదార్థాలపై పరిశీలన చేయగా.. అందులో 12 రకాల పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తేలిందట.

ఆ 12 ఆహార పదార్థాలివే..

  • స్ట్రాబెర్రీ
  • పాలకూర
  • కాలే, కొల్లార్డ్, ఆవపిండి ఆకుకూరలు
  • పీచెస్
  • బేరి
  • నెక్టరైన్స్
  • యాపిల్స్
  • ద్రాక్ష
  • బెల్, మిరియాలు
  • చెర్రీస్
  • బ్లూబెర్రీస్
  • గ్రీన్ బీన్స్

అమెరికా జాబితా అయినప్పటికీ..

సైంటిస్టులు ఈ లిస్టును USకు మాత్రమే పరిమితం చేశారు. అయితే.. మన దేశంలో కూడా ఇప్పుడు ఆహార పంటలన్నీ దాదాపుగా పురుగు మందులతోనే పండుతున్నాయి. దీంతో.. ఆ ప్రభావం ఇక్కడ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు నిపుణులు. మరి.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలన్నప్పుడు ఓ సూచన చేస్తున్నారు. ఆహార పదార్థాలు పురుగుల మందుల బారిన పడ్డాయా? లేదా? అనే విషయాన్ని గుర్తించి.. వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం 5 పద్ధతులు సూచిస్తున్నారు.

రుచి, రూపంలో తేడా : మీరు తినే ఆహారంలో పెస్టిసైడ్స్ ప్రభావం ఉందా లేదా? అనే విషయం తింటున్నప్పుడు తెలుస్తుందని అంటున్నారు. టేస్ట్​లో ఏదైనా తేడా ఉంటే.. అనుమానించాలని చెబుతున్నారు. ఇంకా.. వాటి సహజ ఆకారానికి బదులుగా కాస్త భిన్నంగా ఉన్నా కూడా ఎఫెక్ట్ అయినట్టుగా భావించొచ్చని అంటున్నారు.

వేగంగా పాడైపోవడం : పురుగుమందులు ఎక్కువగా వాడిన ఉత్పత్తులు.. వేగంగా పాడైపోతుంటాయి. కాబట్టి.. మీరు కొనుగోలు చేస్తున్నప్పుడే చూసుకోవాలి. ఒకసారి తేడాను గుర్తిస్తే.. మరోసారి కొనుగోలుకు వెళ్లినప్పుడు జాగ్రత్తవహించాలి.

అలర్జీలు : ఒంటిపై అలర్జీ వంటి సమస్యలు తరచూ తలెత్తినా.. ఇదే కారణం కావొచ్చు. ఈ ఇబ్బంది తరచూ రిపీట్ అవుతుంటే కూడా.. తినే ఆహారంలో పురుగుమందుల కంటెంట్‌ ఎక్కువగా ఉందని అనుమానించాలి.

సీజన్ : మార్కెట్లోకి సీజనల్​ ఫ్రూట్స్ వస్తుంటాయి. ఆ సీజన్ ముగిసిన తర్వాత.. ఆ పండ్ల దిగుబడి నిలిచిపోతుంది. కానీ.. అన్​ సీజన్​లో కూడా ఆ పండ్లు లభిస్తున్నాయంటే.. వాటిలో కచ్చితంగా పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. పండ్లతోపాటు కూరగాయలకూ ఈ విషయం వర్తిస్తుంది. అన్​ సీజన్​లో ఆ పంట పండాలంటే.. పురుగు మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. కాబట్టి.. ఏ మాత్రం అవకాశం ఉన్నా సేంద్రియ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ ఆహారంలో ఇవి ఉంటే.. మీ ఆరోగ్యానికి డోకా లేదు..

ఈ సూత్రాలు పాటిస్తే.. మెరుగైన ఆరోగ్యం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.