Nuts and Dry Fruits Fights Against Cancer in Telugu: క్యాన్సర్ బాధితులు తాజా ఆహారాన్ని తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. దీనికి అదనంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. DNA కణాలకు హాని కలిగించే, క్యాన్సర్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు రియాక్టివ్ అణువులను అడ్డుకుంటాయి. ఇంకా.. క్యాన్సర్ పెరుగుదలను ప్రోత్సహించే సెల్ సిగ్నల్స్‌ను నిరోధిస్తాయి. కాబట్టి.. క్యాన్సర్ ను అడ్డుకోవడానికి డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది!
వాల్ నట్స్(Walnuts): అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. ఇతర నట్స్‌తో పోలిస్తే వాల్‌నట్స్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఓమెగా ఫ్యాటీ-3 ఆమ్లాలతోపాటు పాలీఫినాల్స్ కూడా మెండుగానే ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి. వాల్‌నట్స్‌లో పెడున్‌కులాగిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో యురోలిథిన్‌గా మారుతుంది. యురోలిథిన్స్ ఈస్ట్రోజెన్ గ్రాహకాలతో కలుస్తుంది. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండు ద్రాక్ష(Dry Grapes or Raisins): ఎండు ద్రాక్షలో.. తాజా ద్రాక్ష కంటే ఎక్కువ ఫినోలిక్స్ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఎండు ద్రాక్షలోని గుణాలు.. ప్రీరాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎండుద్రాక్ష క్యాన్సర్‌ను ప్రోత్సహించే ఎంజైమ్‌ల స్థాయిలను తగ్గిస్తుంది. కణ విభజనను అణచివేయడానికి కూడా సహాయపడుతుంది.
వేరు శనగలు నానబెట్టి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!
ప్రూన్స్(Prunes) : డ్రై ప్రూన్స్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రూన్‌లో β-కార్బోలిన్, ఫినోలిక్ పదార్థాల ఆల్కలాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. డ్రై ప్రూన్స్ కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
అంజీర్(Anjeer): అంజీర్‌లో.. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. డ్రై అంజీర్‌లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎండిన అంజీర్‌లో కెమోప్రెవెంటివ్ గుణాలు ఉంటాయి.
వీటితోపాటు బాదం, పిస్తా వంటివి కూడా తీసుకోవడం ద్వారా.. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా త్వరగా మహమ్మారిని తరిమికొట్టొచ్చని చెబుతున్నారు.
చలికాలంలో డేట్స్ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!
వైట్ ఎగ్స్ Vs బ్రౌన్ ఎగ్స్- ఏవి ఆరోగ్యానికి బెస్ట్? ఎందులో పోషకాలు ఎక్కువ?