Menthulu Health Benefits In Telugu : మెంతులు.. దాదాపుగా ప్రతి వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యం. భారతీయులు దీన్ని వంటల్లో రుచి కోసం మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్ర కలిగిన మూలిక. వీటిని సంప్రదాయ ఔషధంగా, చర్మ సంరక్షణ కోసం అనేక శతాబ్దాల నుంచి వినియోగిస్తున్నారు. అనేక పోషకాలు, సమ్మేళనాలతో నిండిన ఈ పదార్థం.. చర్మ సంరక్షణకు, ముఖ సౌందర్యానికి ఎంతో తోడ్పడుతుంది. వీటితో ఇంట్లోనే ఫేస్ మాస్కులు, టోనర్లు తయారు చేసుకోవచ్చు.
Benefits Of Fenugreek For Your Face : మెంతులు మన ముఖానికి బహుముఖ ప్రయోజనాలు అందిస్తాయి. వీటితో తయారు చేసిన క్రీమ్స్, జెల్స్ని రాసుకోవడం వల్ల ముఖానికి ఆరోగ్యకరమైన, మంచి రంగు వస్తుంది. మీ చర్మ సంరక్షణ దినచర్యలో మెంతికూరను చేర్చడం ద్వారా DIY ఫేస్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. మొత్తానికి ఇవి మీ ముఖానికి సహజ సౌందర్యం, తేజస్సునిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటి వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముఖ కాంతి
మన చర్మ ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు మెంతులు పవర్ హౌజ్ లాంటివి. వీటిని రెగ్యులర్‌గా వినియోగించడం వల్ల ముఖానికి సహజమైన కాంతి ఏర్పడుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, మెరిసే ఛాయతో ఉన్న చర్మం మీ సొంతమవుతుంది.
2. మొటిమలు తగ్గుతాయి
మెంతుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. మొటిమల్ని ఎదుర్కోవడంలో సాయపడతాయి. మెంతికూరను పేస్ట్‌గా చేసి గానీ, లేదా దాని నూనెను గానీ మొటిమలున్న ప్రాంతాల్లో పూయటం వల్ల మంట తగ్గుతుంది. అంతేకాకుండా వాటి వల్ల వచ్చిన ఎరుపును సైతం తగ్గిస్తాయి. కొత్త మొటిమలు ఏర్పడకుండా కూడా నిరోధిస్తాయి.
3. యవ్వన కాంతి
మెంతులు విటమిన్ సి, నియాసిన్ లాంటి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. కొల్లాజెన్ యవ్వనంగా కనబడేందుకు తోడ్పడుతుంది. ఈ సమ్మేళనాలు ముఖంపై ఉన్న ముడతల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఫలితంగా మీ చర్మం మరింత యవ్వనంగా కనిపిస్తుంది.
4. మృత కణాల తొలగింపు
మెంతులను ఒక సున్నితమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌గా రుబ్బుకోవచ్చు. వీటిలో ఉండే సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు మృత కణాల్ని తొలగించడంలో తోడ్పడతాయి. మృత కణాలు తొలిగిపోవడం వల్ల మీ ముఖం చాలా ఫెయిర్‌గా తయారవుతుంది. దీంతో పాటు తాజా ఛాయ కూడా వస్తుంది.
5. నల్లటి వలయాలు మాయం
మెంతులులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అలసిపోయిన కళ్లకు విశ్రాంతినివ్వటం వల్ల సాయపడతాయి. మెంతులు కలిపిన పేస్ట్ లేదా జెల్‌ని కళ్ల కింద అప్లై చేయడం వల్ల ఉబ్బరం, నల్లటి వలయాలు, ఫైన్లైన్లు తగ్గుతాయి.
మీకు పుట్టబోయే బిడ్డ రూపాన్ని - ఈ 6 అంశాలు నిర్ణయిస్తాయని మీకు తెలుసా?