Causes For Under Eye Dark Circles : నేటి కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్(Dark Circles Under The Eyes) ఒకటి. ఈ సమస్య తలెత్తడానికి నిద్రలేమి.. అలసట, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ అతిగా చూడడం వంటివి ప్రధాన కారణాలుగా భావిస్తుంటారు. అయితే.. ఇవే కాకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా కళ్లకింద నల్లటి వలయాలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఆడవాళ్లు అందంగా కనిపించడం కోసం.. నిత్యం ఏవేవో సౌందర్య సాధనాలు ముఖానికి రాస్తుంటారు. ఇవి కూడా ఆ సమస్యకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువగా ఉపయోగించండం వల్ల వచ్చే అలర్జీల కారణంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయని చెబుతున్నారు. కొందరైతే ఈ మచ్చలు వచ్చినప్పుడు వాటిని దాచడానికి అధిక రెటినాయిడ్స్ ఉపయోగిస్తుంటారు. అలా యూజ్ చేయడం ద్వారా అందులోని కెమికల్స్ కారణంగా వర్ణద్రవ్యం మరింత దెబ్బతిని ఫేస్‌పై భారీ పిగ్మెంటేషన్ రావడం లాంటి చర్మ సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు బ్యూటీ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మోతాదులో యూజ్ చేయడం బెటర్ అని అంటున్నారు.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి మరో కారణమేంటంటే.. టీ, కాఫీ అతిగా తాగడం. వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వచ్చే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ కూడా ముఖ్యంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణమవుతుందట! దీని కారణంగా చర్మం పొడి బారడంతోపాటు మచ్చలు మరింత నలుపుగా కనిపించేలా చేస్తుందట. కాబట్టి టీ, కాఫీలను తాగడం తగ్గించి బాడీని ఎప్పటికప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని చెబుతున్నారు.
తల నుంచి కాలిగోరు వరకు అందంగా ఉండాలా.. అయితే 'ఇ' ఆయిల్ వాడేయండి!
డార్క్ సర్కిల్స్ సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి..
- ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- ముఖ్యంగా మీ డైట్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
- అలాగే ఎప్పటికప్పుడూ మీ చక్కెర స్థాయిలను చెక్ చేసుకోండి. ఎందుకంటే మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు కూడా కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణమవుతాయి.
- సూర్యరశ్మి నుంచి రక్షణ పొందండి. ఎందుకంటే సూర్యరశ్మిలోని UVA, UVB కిరణాలు చర్మాన్ని దెబ్బతీయడమే కాదు కళ్ల కింద నల్లటి వలయాలకు దారితీస్తాయి. కాబట్టి ఎండ నుంచి రక్షణ పొందడానికి సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్ యూజ్ చేయండి.
- కంటికింద చర్మాన్ని అక్కడ రాసిన ప్రొడక్ట్స్ లేదా క్రీమ్స్ క్లీన్ చేసేటప్పుడు.. ఎక్కువగా రుద్దకుండా లేదా లాగకుండా జాగ్రత్త తీసుకోండి.
- కంటి కింద చర్మ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి బలంగా రుద్దడం వంటివి చేస్తే నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ఇవన్నీ పాటించినా డార్క్ సర్కిల్స్ సమస్య ఇలాగే ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - ఈ ఫుడ్‌తో ఈజీగా చెక్ పెట్టండి!
అనవసరమైన వెంట్రుకలతో ఇబ్బందిగా ఉందా?.. ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసా?