ETV Bharat / sukhibhava

డయాబెటిస్​ మందులతో కంటిచూపు దెబ్బతింటుందా?.. డాక్టర్లు ఏమంటున్నారు? - Diabetes medication and Relation for vision loss

షుగర్ లేదా డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న ఓ ఆరోగ్య సమస్య. భారతీయుల్లో ఈ సమస్య రోజురోజుకు మరింత పెరుగుతోంది! మధుమేహం​ వస్తే దానికి వాడే మందులతో తలెత్తే సైడ్​ఎఫెక్ట్స్ మీద ఉన్న అనేక అపోహలను ఈ స్టోరీ ద్వారా నివృత్తి చేసుకుందాం!

Misconception On Diabetes Medication A Risk Of Vision Loss
షుగర్‌ వ్యాధికి వాడే మందులతో కంటిచూపు దెబ్బతింటుందా..? డాక్టర్లు ఏమంటున్నారు..?
author img

By

Published : May 10, 2023, 7:40 AM IST

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి షుగర్ బారిన పడితే జీవితాంతం అది మనల్ని వెంటాడుతూనే ఉంది. జీవితాంతం ఇక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. వ్యాయామంతో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ షుగర్‌ను అదుపులో పెట్టుకునేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటమే కాకుండా దాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం శ్రద్ధ వహిస్తూ ఉండాలి.

షుగర్​ లెవెల్స్​ అదుపులో ఉంచుకోవాలి!
డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కళ్లు, కిడ్నీ, గుండెపై డయాబెటిస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే రక్తంలోని షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకుంటూ ఉండాలి.

షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు చాలామంది అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. మందులు వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు, సమస్యలు వస్తాయని డయాబెటిస్ రోగులు ఆందోళన పడుతూ ఉంటారు. దీంతో కొంతమంది మందులు వాడకుండా ఇతర మార్గాల్లో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

షుగర్ వ్యాధికి దీర్ఘకాలం మందులు వాడటం వల్ల కంటిచూపు తగ్గడమే కాకుండా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మందుల ప్రభావం కంటిచూపుపై పడే అవకాశం లేదంటున్నారు. కంటిచూపు తగ్గడానికి, మందులకు ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నారు.

కానీ కొన్ని సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడేవారిలో కంటి నరాలు, కిడ్నీ, గుండె నరాలపై ప్రభావం ఉంటుంది. షుగర్ ప్రభావం నేరుగా కంటి రెటీనా పొరపై పడుతుంది. ఇలాంటి సమయాల్లో కంటిచూపు మందగించే అవకాశం ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మందులు మానేస్తే మరింత ప్రమాదం!
షుగర్‌కు మందులు వాడటం వల్లనే తమకు కంటిచూపు మందగిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. దీంతో వెంటనే మందులు వాడటం మానేస్తూ ఉంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. షుగర్ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోండి!
షుగర్‌తో సంబంధం లేకుండా వయస్సు పెరిగే కొద్దీ కూడా ప్రతి ఒక్కరిలో కంటిచూపు కాస్త తగ్గుతూ ఉంటుంది. శుక్లాల వల్ల కంటిచూపు మందగించడం జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం వల్ల కంటిచూపు మరింత మెరుగుపడుతుంది. షుగర్‌తో బాధపడేవారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మందులు వాడుతూ షుగర్ స్థాయులను అదుపులో ఉంచుకుంటూనే కంటిచూపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కంటి చికత్సతో పాటు కిడ్నీ, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోవడం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌కు మందులు వాడటం వల్ల కంటిచూపుపై ప్రభావం చూపవని, షుగర్ స్ధాయిలు అదుపులో లేని సమయంలో కంటిచూపుపై దుష్ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డయాబెటిస్​ మందులతో కంటిచూపు దెబ్బతింటుందా?.. డాక్టర్లు ఏమంటున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.