How Women Behave When They are Not Interested in Sex : వైవాహిక జీవితం సంతృప్తిగా సాగిపోవాలన్నా.. భార్యాభర్తల బంధం మరింతగా బలపడాలన్నా.. వ్యక్తిగతంగా దంపతుల ఆరోగ్యం బాగుండాలన్నా.. శృంగారం అత్యవసరం. అన్ని సమస్యలకూ అదే దివ్య ఔెషధం! కానీ.. నేటి బిజీబిజీ లైఫ్‌లో చాలా మంది దంపతులు శృంగారాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నారు. కొంత కాలం తర్వాత అసలు ఆసక్తి చూపలేకపోతున్నారట!
చాలా కారణాలు..
దంపతులు రతికి సిద్ధం కావాలంటే.. ముందుగా కావాల్సింది మూడ్. ఆ కోరిక కలగాలంటే.. మానసికంగా, శారీరకంగా హెల్దీగా ఉండాలి. ఈ ఆరోగ్యం ఇద్దరిలోనూ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా.. ఏ ఒక్కరిలోనూ లేకపోయినా.. అంతే సంగతులు. మరికొన్ని సమయాల్లో.. భర్తకు ఇష్టమున్నా భార్య ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. అదేవిధంగా.. మహిళల్లో పలు కారణాలతో 35 నుంచి 40 ఏళ్లు రాగానే శృంగారంపై కోరిక తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మహిళలు ఎలా ప్రవర్తిస్తారు? ఆ సమయంలో భర్త ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
సాకులు చెబుతారు..
శృంగారంపై ఆసక్తి లేని మహిళలు ఏదో ఒక సాకు చూపిస్తూ.. ఆ కార్యాన్ని వాయిదా వేస్తూ ఉంటారట. తలనొప్పి, కడుపునొప్పి లాంటి కారణాలు చెప్పడమో.. లేదంటే.. నిద్ర వస్తోందని, అలసటగా ఉందని చెప్పడమో చేస్తుంటారట. ఇంకొందరైతే సెక్స్ తర్వాత జననాంగాలు నొప్పిగానూ, చిరాగ్గానూ ఉంటాయంటూ చెబుతారట. శృంగారం వద్దని డైరెక్ట్‌గా చెప్పకుండా.. ప్రతిరోజూ ఇలా గడిపేస్తుంటారు. దాంతో .. ఏదో ఒక సమయంలో భర్తల ఆగ్రహానికి గురవుతారు.
సంసారంలో సమస్యలు వచ్చే ఛాన్స్..
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే.. సంసారంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్యపై ప్రేమ ఉండే భర్త కూడా.. ఎంతోకాలం వేచి ఉండడం సాధ్యం కాదు. ఈ క్రమంలో.. వారు కోరుకున్నది లభించనప్పుడు ఆగ్రహించే అవకాశం ఎక్కువ. ఈ కారణంగా.. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు సన్నగిల్లుతాయని.. ఇది వివాహేతర సంబంధాలకూ దారితీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భర్తలు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.
How To Increase Sexual Feelings : సెక్స్ లైఫ్ డల్‌గా ఉందా?.. ఈ చిట్కాలతో మీ లైంగిక ఆసక్తి డబుల్!
అర్థం చేసుకోవాలి..
వివాహం అయ్యాక.. ఓ నిర్ణీత వయస్సు తర్వాత స్త్రీలు సెక్స్‌కు ఎందుకు దూరంగా ఉంటారో భర్తలు ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించడానికి దశల వారీగా ప్రయత్నించాలి. గొడవలు, వివాదాలు, సందేహాలతో ఉపయోగం లేకపోగా.. నష్టం ఎక్కువ కలిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకోవడం ముఖ్యం. వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అర్థం చేసుకొని.. ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. అలాంటి సమయాల్లోనే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీ భాగస్వామికి అర్థమవుతుంది. ఇలా చేయడం ద్వారా కొంతమేర ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?
ఈ విషయమై భాగస్వామితో మాట్లాడాలి. సమస్య ఎక్కడ వస్తోంది? ఎందుకు వస్తోంది? అనే కారణాలను అడిగి తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసి పరిష్కార మార్గాలను వెతకాలి. అయినా.. మీ వల్ల కాకపోతే.. అప్పుడు వైద్యులను కలవాల్సి ఉంటుంది. వారు తగిన పరిష్కార మార్గాలను చూపిస్తారు. అవి పాటిస్తూ.. ప్రశాంతంగా ఉంటూ.. యోగా వంటి వ్యాయామాలు చేస్తే.. మళ్లీ పూర్వ స్థితికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సెక్స్‌కు గ్యాప్ ఇస్తే ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఇలా చేస్తే అంతా సెట్!
మహిళల్లో లైంగిక కోరికను పెంచే 5 సహజ పద్ధతులు! అవేంటో తెలుసా?