ETV Bharat / sukhibhava

చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

How To Avoid Fish Smell In Kitchen : ఇంట్లో చేపలు వండినప్పుడు వంటగది ఎక్కువగా నీచు వాసన వస్తుంటుంది. దీనివల్ల కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటే ముక్కు ముసుకోవాలి. ఇలా నాన్‌ వెజ్‌ వంటకాలు వండినప్పుడు నీచు వాసన రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

How To Avoid Fish Smell In Kitchen
How To Avoid Fish Smell In Kitchen
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 10:26 AM IST

How To Avoid Fish Smell In Kitchen : చాలా మంది ఇళ్లల్లో నాన్​వెజ్​ వండుకుంటారు. అందులో ఫస్ట్​ ప్రయారిటీ చికెన్​ అండ్​ ఫిష్​. అయితే కిచెన్‌లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు. ముఖ్యంగా చేపల విషయంలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. వంట వండటం పూర్తై గిన్నెలు శుభ్రం చేసిన తర్వాత కూడా ఆ వాసన పోదు. దీనివల్ల కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటే ముక్కు ముసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ నీచు వాసనకు పరిష్కారంగా కొన్ని చిన్న టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నీచు వాసనను తగ్గించే చిట్కాలు :

Tips to Avoid Fish Smell in Kitchen:

కాఫీ గింజలతో : ఓ గిన్నెలో కొద్దిగా వెనిగర్, కొద్దిగా కాఫీ పొడిని కౌంటర్ టాప్‌లో ఉంచితే నీచు వాసన రాకుండా ఉంటుంది. కాఫీ గింజలను వేయించినా కూడా ఆ వాసనతో ఈ సమస్య దూరమవుతుంది.

ఎయిర్ ఫ్రెషనర్స్ : కొంత మంది వంట వండిన తరవాత వెంటనే చెడు వాసన వస్తోందని ఎయిర్ ఫ్రెషనర్స్‌ను ఉపయోగిస్తుంటారు. కిచెన్‌లో చేపలను వండిన వెంటనే ఇవి వాడొద్దు. ఎందుకంటే ఎయిర్​ఫ్రెష్​నర్​ స్మెల్​ వంటలకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట పూర్తైన తరవాత వండిన గిన్నెలను పక్కన పెట్టి.. తర్వాత ఫ్రెషనర్స్ వాడొచ్చు.

దాల్చిన చెక్కతో వాసనకు చెక్!: ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద మీడియమ్‌ మంటపై మరిగించాలి. ఆ నీటిలోకి కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో కిచెన్‌లోని నీచు వాసన తొలగిపోయి, మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించినా మంచి ఫలితం ఉంటుంది.

క్యాండిల్స్ వెలిగించండి : ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వాటిని వెలిగించిన కూడా నీచు వాసన పోతుంది.

పచ్చ కర్పూరంతో..: ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో పచ్చ కర్పూరం వేసి ఇంట్లో ఓ మూలకు పెట్టండి. దీంతో మంచి వాసన వస్తుంది. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది, అదేంటంటే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

వెనిగర్‌తోనూ..: కిచెన్‌లో నాన్​వెజ్​ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు. ఇదేవిధంగా కిచెన్‌లో నుంచి ఇంకా ఏమైనా చెడు వాసన వస్తుంటే, ఒక చిన్న గిన్నెలో వైట్ వెనిగర్‌ని తీసుకుని దాన్ని కిచెన్ ప్లాట్‌ఫాంపై పెట్టండి. ఇది చెడు వాసనలన్నింటినీ దూరం చేస్తుంది.

కిటికీలు తెరవండి..: కొంతమంది ఎప్పుడు చూసినా కిటికీలు, తలుపులు మూసి ఉంచుతారు. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు, లోపలి గాలి బయటికి పోదు. దీంతో ఇంట్లోకి తాజా గాలి రాకపోవడంతో, చెడు వాసన వస్తుంటుంది. కాబట్టి ఇంట్లో వంట చేసేముందు కిటికీలైనా సరే తెరిచి ఉంచాలి.

ఆకులతో..: రోజ్‌మేరీ వంటి కొన్ని మంచి వాసనను వేదజల్లే ఆకులు మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టండి. దీంతో ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది.

వెనిగర్, నీరు..: చేపలు ఫ్రై చేస్తున్నప్పుడు ఓ పాన్‌లో నీరు పోసి మరిగించండి. ఆ మరుగుతున్న నీటిలో రెండు, మూడు చెంచాల వెనిగర్ కలపండి. ఇది వెంటనే గాలిలో కలిసిపోయి వాసనని దూరం చేస్తుంది.

ఎగ్జాస్ట్ ఫ్యాన్..: ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో చిమ్నీనీలు అందుబాటులో ఉన్నాయి. నాన్​వెజ్​ వంటకాలు, లేదా ఏదైనా ఫ్రై లు చేసే ముందు ఎగ్జాస్ట్​ వాడటం వల్ల నీచు వాసన పోవడమే కాదు, పొగ కూడా ఉండదు.

వంటగదిని శుభ్రం చేయండి : చేపలు, మాంసం వంటివి వండిన తర్వాత, వీలైనంత త్వరగా కిచెన్‌ను, సింక్‌ను క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు వాసన తగ్గిపోతుంది. స్టౌ, కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడం వల్ల కూడా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

జీర్ణ వ్యవస్థ బాధిస్తోందా? ఈ దుంపతో రిలాక్స్ అయిపోండి!

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.