ETV Bharat / sukhibhava

హెపటైటిస్ ప్రమాదం - క్యాన్సర్​గా మారే వరకు లక్షణాలు కనిపించవు - ఇలా అడ్డుకోవాల్సిందే! - what is Hepatitis B

Hepatitis B Symptoms And Treatment : కొంత మంది తరచూ అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, జ్వరంతో బాధపడుతుంటారు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతే సాధారణ సమస్యలుగా భావించొచ్చు. కానీ.. ఇవి వెంట వెటనే రిపీట్ అవుతుంటే మాత్రం.. తీవ్రమైన లివర్ సమస్య కావొచ్చని​ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hepatitis B Symptoms And Treatment
Hepatitis B Symptoms And Treatment
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 12:06 PM IST

Hepatitis B Symptoms And Treatment : హెపటైటిస్ బి.. లివర్ కు అత్యంత ప్రమాదకరమై జబ్బు ఇది. నిశబ్ధంగా శరీరంలోకి చేరే ఈ వైరస్​.. దీర్ఘకాలంలో కాలేయం క్యాన్సర్​కు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఒంట్లోకి చేరిన వెంటనే దీని లక్షణాలు కనిపించవు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంత ప్రమాదకరమైన హైపటైటిస్​ బి అంటే ఏమిటి ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధికి చికిత్స ఏమైనా ఉందా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

హెపటైటిస్‌ ఎలా వస్తుంది..?

హెపటైటిస్‌ ద్వారా కాలేయంలోని ప్రతి కణానికీ వాపు వస్తుంది. ఇది వైరస్‌తో వ్యాపిస్తుంది. ఇందులో ఐదు రకాలున్నాయి. హైపటైటిస్​ ఎ, సి, డి, ఈ కన్నా.. బి చాలా ప్రమాదం. గర్భిణులకు హెపటైటిస్‌ వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకు హైపటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్‌ బీ, సీలు దీర్ఘకాలికంగా శరీరంలో కొనసాగితే.. లివర్‌ క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

హైపటైటిస్ లక్షణాలు..

  • అలసట
  • కడుపు నొప్పి
  • కామెర్లు (చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం)
  • వికారం
  • వాంతులు
  • జ్వరం
  • మూత్రం ముదురు రంగులో రావడం
  • దురద
  • కీళ్ల నొప్పులు

పైన తెలిపిన లక్షణాలు తొలినాళ్లలో కనిపించవు. ప్రమాద తీవ్రత పెరుగుతున్న కొద్దీ కనిపిస్తాయి. అదే సమయంలో అంత ప్రమాదకరంగా అనిపించకపోచ్చు. అందువల్ల చాలా మంది పెద్దగా పట్టించుకోరని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!

హైపటైటిస్​ ఎలా వస్తుంది?

  • కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల హెపటైటిస్‌ ఎ, ఈ సోకుతాయి.
  • అలాగే హెపటైటిస్‌ బి ఉన్నవారి రక్తం, శారీరక స్రావాల ద్వారా సోకుతుంది. కాబట్టి అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి.
  • ఇతరులు వాడిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్లు, టూత్‌బ్రష్షుల వంటివి ఉపయోగించకూడదు.
  • హెపటైటిస్‌ సి ప్రధానంగా రక్తం ద్వారా స్ప్రెడ్​ అవుతుంది. కాబట్టి రక్తం అవసరమైతే తప్పక చెక్​ చేసుకోవాలి.
  • పచ్చబొట్లు పొడిచేటప్పుడు, చెవులు, శరీర భాగాలు కుట్టేటప్పుడు ఉపయోగించే సూదులు, పరికరాలు ఒకరికి వాడినవి మరొకరికి వాడకూడదు.

చికిత్స ఏంటి?

ప్రస్తుతం హెపటైటిస్‌ బికి టీకా అందుబాటులో ఉంది. కానీ.. దీనిని పూర్తిగా నివారించడమే అత్యుత్తమ మార్గం. హెపటైటీస్‌ సి కూడా ప్రమాదకరమే అయినా.. దీనికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. సి వైరస్‌కు 24 వారాల పాటు మందులు వాడితే తగ్గిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ముందుగానే గుర్తించి వైద్యుల సలహాతో మందులు వాడాలి. కొన్ని కేసుల్లో రోజుకు ఒక్కటి చొప్పున జీవితాంతం వాడాల్సి రావొచ్చు.

ఈ వ్యాధి సోకకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ఏడాది నుంచి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలు అందరికీ హెపటైటిస్-ఎ వాక్సిన్ చేయించాలి. హెపటైటిస్ వ్యాధి సోకే అవకాశం ఉన్న, దీర్ఘకాలంగా హెపటైటిస్ బి లేదా సితో బాధపడుతున్న వారందరూ కూడా హెపటైటిస్ -ఎ వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి.

ఎసిడిటీ ముదిరితే జరిగేది ఆ ఘోరమే - కడుపులోని మంట ఇలా ఆర్పేయండి!

మీ శరీరం ఈ హెచ్చరికలు చేస్తోందా? - అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.