ETV Bharat / sukhibhava

Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్​కు డోకా ఉండదు! - pineapple during menstruation

Fruits To Eat During Periods In Telugu : నెలసరి సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ మార్పులు జరుగుతాయి. రక్తస్రావం జరుగుతుంది. అందుకే ఈ సమయంలో మహిళలు తమ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పండ్లను తమ డైట్​లో చేర్చుకోవాలి. మరి ఏయే పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

5 fruits to eat during your Menstrual Cycle
Fruits To Eat During Periods
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 7:14 AM IST

Fruits To Eat During Periods : మహిళలు నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన డైట్​ను అవలంభించడం ఎంతో శ్రేయస్కరం. రుతుచక్రం నడిచే సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి. ఇవి తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మహిళలు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ప్రధానంగా ఈ సమయంలో పండ్లని తమ డైట్​లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మీ శరీరంలో సహజమైన శక్తిని ప్రసరింపజేస్తాయి. అందుకే ఇప్పుడు మనం మహిళలు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన పండ్లు గురించి తెలుసుకుందాం.

అరటిపండ్లు
Banana Benefits In Periods : పీరియడ్స్​ సమయంలో అరటిపండ్లు.. మహిళలకు మంచి నేస్తాలుగా చెప్పవచ్చు. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి ద్రవ సమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ బి-6 కంటెంట్.. మూడ్ స్వింగ్స్, చిరాకులను తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పళ్లలో కార్బోహైడ్రేట్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల శరీరంలో సహజశక్తిని ప్రేరేపిస్తుంది. నెలసరి కాలంలో తరచుగా అరటి పండ్లు తింటే.. అలసట, నిసత్తువ దూరమవుతాయి.

banana benefits in periods
పీరియడ్స్​ సమయంలో అరటి పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బెర్రీలు
Strawberry Benefits In Periods : స్ట్రాబెర్రీస్​, బ్లూబెర్రీస్ లాంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి వాపును నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బెర్రీస్​లో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్.. మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. బెర్రీలు మంచి రుచిగా ఉండడమే కాకుండా.. ఇవి మీ ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి.

strawberry benefits for periods
పీరియడ్స్​ సమయంలో స్ట్రాబెర్రీస్​ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నారింజలు
Orange Fruit Benefits In Periods : నారింజలు సహా ఇతర పుల్లని పండ్లలో విటమిన్​ - సి ఉంటుంది. ఈ సీ-విటమిన్​ మీ శరీరం ఇనుము శోషణ చేసుకోవడానికి సహకరిస్తుంది. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళల్లో ఇనుము స్థాయిలు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది శారీరక అలసట, బలహీనతకి దారి తీస్తుంది. ఆకుకూరలు, చిక్కుళ్ళు లాంటి ఆహార పదార్థాల ద్వారా తీసుకున్న ఇనుమును శరీరం శోషణ చేసుకోవడానికి సీ-విటమిన్ సహకరిస్తుంది.

orange fruit benefits for periods
పీరియడ్స్​ సమయంలో ఆరెంజ్​ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పైనాపిల్
Pineapple Benefits In Periods : పైనాపిల్​లో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండే ఎంజైమ్. ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా శరీరానికి కావాల్సిన విశ్రాంతిని కల్పిస్తుంది. బ్రోమెలైన్ ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.

pineapple benefits for periods
పీరియడ్స్​ సమయంలో పైనాపిల్​ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండ్లు
Kiwi Fruit Benefits In Periods : కివి పండ్లలో విటమిన్ - కె, విటమిన్ - ఈ, ఫోలేట్ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. బహిష్టు సమయంలో ఇది చాలా ముఖ్యం. కివి పండ్లలో ఉండే విటమిన్లు, ఫైబర్​ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

kiwi fruit benefits for periods
రుతుచక్రం సమయంలో కివీ ఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రుతుచక్రం సమయంలో మహిళలు తమ డైట్​లో ఈ 5 పండ్లని చేర్చుకోవడం ద్వారా సహజంగా వచ్చే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అరటిపండ్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పైనాపిల్‌ నొప్పులన్ని తగ్గిస్తుంది. ఇలా ఒక్కో పండుతో ఒక్కో లాభం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.. నెలసరి సమయంలో బాగా నీళ్లు తాగాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే.. పళ్లు తీసుకోవాలి. అప్పుడే మీ ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.