ETV Bharat / sukhibhava

ఫ్రిజ్​లో ఆ 7 వస్తువులను నిల్వ ఉంచుతున్నారా? ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోవాల్సిందే! - రిఫ్రిజిరేటర్​లో ఉంచకూడని ఏడు పదార్థాలు

Foods You Should Not Refrigerate : కూరగాయలు సహా పలు పదార్ధాలు.. తాజాగా ఉండేందుకు చాలా మంది రిఫ్రిజిరేటర్​లో నిల్వ ఉంచుతారు. అయితే కొన్ని రకాల పళ్లు, కూరగాయలు ఫ్రిజ్​లో ఉంచడం వల్ల వాటి నాణ్యత కోల్పోతాయని మీకు తెలుసా? వాటిని ఫ్రిజ్​లో ఉంచడం వల్ల వచ్చే నష్టాలేంటంటే?

Foods You Should Not Refrigerate
Foods You Should Not Refrigerate
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 7:13 AM IST

Foods You Should Not Refrigerate : సాధారణంగా కూరగాయలు, పళ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రిజ్​లో నిల్వ ఉంచుతుంటారు. అయితే వీటిలో పలు రకాల ఆహారపదార్థాలు, ఫ్రిజ్​లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషకవిలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్​లో నిల్వచేయకూడని పల్లు, కూరగాయలు ఏంటి? వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలేంటి? మొదలైన వివరాలు మీ కోసం.

అరటిపళ్లు
అరటిపళ్లు అతిశీతల వాతావరణాన్ని తట్టుకోలేవు. వీటిని మనం ఫ్రిజ్​లో ఉంచినపుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి. అరటిపళ్లు ఆకృతి, పక్వత కూడా దెబ్బతింటాయి. ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి. దానివల్ల వాటి రుచి కొల్పోతాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్​లో అరటిపళ్లు నిల్వఉంచకపోవడమే మంచిది.

వెల్లుల్లి
వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వెల్లుల్లిపై మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటిని రిఫ్రిజిరేటర్​లో నిల్వచేయటం అంత మంచిది కాదు.

ఉల్లి
ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని రిఫ్రిజిరేటర్​లో కొందరు నిల్వ చేస్తుంటారు. ఫలితంగా ఉల్లిపాయలో ఉండే సహజమైన ఫ్లేవర్​ నశిస్తుంది. దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి. అందువల్ల ఉల్లిని రిఫ్రిజిరేటర్​లో ఉంచకూడదు. గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవ్వకుండా ఉంటాయి.

తేనె
తేనెలో నీటి శాతం తక్కువ, ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది. ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు. కానీ తేనెను ఫ్రిజ్​లో ఉంచడం వల్ల అది స్పటికీకరణం చెందవచ్చు. దీనివల్ల తేనె దాని సహాజ గుణాలను కోల్పోతుంది.

బంగాళదుంపలు
బంగాళదుంపల్లో అధికంగా స్టార్చ్​ ఉంటుంది. ఇవి చల్లని, చీకటి, పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి. శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

టమోటాలు
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల వాటి రుచిని కోల్పోయే అవకాశం ఉంది.

కాఫీ గింజలు
కాఫీ గింజలకు పరిసరాల నుంచి తేమ, వాసనలను గ్రహించే లక్షణం ఉంది. అయితే వాటిని ఫ్రిజ్​లో నిల్వచేయడం వీటి రుచిని కోల్పేయే అవకాశం ఉంది. పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్​లో ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

పండ్లు, కూరగాయలు ఫ్రిజ్​లో ఉంచుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే

ఈ పండ్లను కలిపి తింటే యమ డేంజర్.. అస్సలు తినకూడని కాంబినేషన్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.