ETV Bharat / sukhibhava

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 3:19 PM IST

Eggs In Breakfast : కొంత మంది అసలు కోడి గుడ్డు ముట్టుకోరు. మరికొందరు.. బ్రేక్‌ఫాస్ట్‌లోనే గుడ్లు లాగించేస్తుంటారు. మరి.. ఇలా టిఫెన్​లో ఎగ్ తినడం మంచిదేనా??

Eggs In Breakfast
Eggs In Breakfast

Eggs In Breakfast : రోజుకో యాపిల్‌ తింటే.. డాక్టర్‌ను కలవాల్సిన అవసరం ఉండదు అన్నది ఎప్పటి నుంచో వింటున్న మాట. ఇదేవిధంగా.. రోజుకో గుడ్డు తినడం వల్ల కూడా.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం అంతగా రాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా బరువు తక్కువ కావాలనుకునే వారు రోజూ వారి ఆహారంలో.. గుడ్డు తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే.. ఆ గుడ్డును బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిదేనా? ఉదయమే గుడ్డు తినడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు మంచిదేనా ?
రోజు వారి ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో శరీరానికి కావాలసిన పోషకాలన్నీ ఉంటాయి. అందుకే గుడ్డును సూపర్‌ ఫుడ్‌ అని అంటారు. గుడ్డులోని తెల్లసొనలో 50 శాతం ప్రోటీన్, పచ్చసొనలో 90 శాతం కాల్షియం, ఐరన్‌ ఉంటాయి. అయితే.. ఈ గుడ్డును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్​లో తీసుకోవడం మంచిదేనా అంటే.. మంచిదే అంటున్నారు నిపుణులు. వ్యాయమాలు చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్‌ తినడం వల్ల మధ్యాహ్నం ఆకలి ఎక్కువగా వేయదని అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు, ఆకలిని నియంత్రించుకోవాల్సిన పని లేదు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్‌లు ఉండే గుడ్లను ఆహారంగా తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

బ్లాక్​హెడ్స్​తో ఇబ్బంది పడుతున్నారా?- ఈ టిప్స్​ ఫాలో అయ్యి మీ సమస్యకు స్వస్తి పలకండి!

గుడ్డు తినడం వల్ల అందే పోషకాలు..
ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరానికి అందే పోషకాల శాతం ఓసారి చూస్తే..

  • ఫోలేట్ - 5 శాతం
  • సెలీనియం - 22 శాతం
  • ఫాస్ఫరస్ - 9 శాతం
  • విటమిన్ ఎ - 6 శాతం
  • విటమిన్ బి2 - 15 శాతం
  • విటమిన్ బి5 - 7 శాతం
  • విటమిన్ బి12 - 9 శాతం

కంటి సమస్యలు రాకుండా..
చిన్న పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఏ.. ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయని చెబుతున్నారు. దీంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయని చెబుతున్నారు. జీవక్రియ సక్రమంగా పనిచేయడానికి కోడిగుడ్డు ఉపయోగపడుతుందట. విటమిన్ సి తప్ప.. మిగిలిన విటమిన్లీ ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుందని, ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్ తప్పక తినాలి..

గుడ్డు ప్రతిరోజూ తప్పకుండా తినాలని చెబుతున్న నిపుణులు.. నిత్యం బ్రేక్‌ఫాస్ట్ కూడా కచ్చితంగా చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఉదయం తినే ఆహారం రోజు మొత్తానికి కావాల్సిన శక్తిని తయారు చేస్తుందని అంటున్నారు. ఏవేవో కారణాలు చూపుతూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే.. ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుందని అంటున్నారు. అందుకే తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలని.. అందులోకి గుడ్డును తీసుకోవడం మరింత మంచిదని చెబుతున్నారు.

చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా?

భోజనంలో ఈ మార్పులు చేయండి.. షుగర్‌ మీరు చెప్పినట్టు వినాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.