ETV Bharat / sukhibhava

కొవ్వు అతిగా తింటున్నారా- తెలుసుకోవడం ఎలా?

మీరు కొవ్వుతో బాధపడుతున్నారా? తినే పదార్థాల మీద దృష్టి పెడితే చాలనుకుంటున్నారా? ఇది సరిపోదు.. కొన్ని సార్లు అతిగా తినడం మితిమీరితే బరువు పెరగడం దగ్గర్నుంచి గుండెజబ్బుల వరకు రకరకాల ముప్పులు తెచ్చిపెడుతుంది. అతిగా కొవ్వు తింటున్నామని ఈ లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. వాటిని గుర్తించి జాగ్రత్తపడొచ్చు.

author img

By

Published : Jun 26, 2021, 3:05 PM IST

అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే బరువు పెరగటం దగ్గర్నుంచి గుండెజబ్బుల వరకు రకరకాల ముప్పులు తెచ్చిపెడుతుంది. మరి అతిగా కొవ్వు తింటున్నామని తెలుసుకోవటమెలా? తినే పదార్థాల మీద దృష్టి పెడితే చాలు కదా అనుకుంటున్నారా? ఇది నిజమే అయినా కొన్ని కొన్ని లక్షణాలను బట్టీ దీన్ని గుర్తించొచ్చు.

కడుపుబ్బరం

పీచు ఎక్కువగా ఉండే క్యాబేజీ, గోబీపువ్వు వంటివి కడుపుబ్బరం, గ్యాస్‌కు దారితీస్తాయన్నది తెలిసిందే. ఇవే కాదు, కొవ్వు పదార్థాలు మరీ ఎక్కువగా తిన్నా కూడా కడుపు ఉబ్బుతుంది. కొవ్వులు త్వరగా జీర్ణం కావు. పొట్టలో చాలాసేపు పులిసిపోయే స్థితిలో ఉంటాయి. దీంతో తేన్పులు, కడుపుబ్బరం వంటి ఇబ్బందులు వేధిస్తాయి.

విరేచనాలు

కొవ్వు పదార్థాలు అతిగా తింటే విరేచనాలు కూడా పట్టుకోవచ్చు. కొందరి శరీరం కొవ్వు పదార్థాలను సరిగా శోషించుకోలేదు. ఇలా కొవ్వులు అరకొరగా జీర్ణమైతే చిన్నపేగులు, పెద్దపేగు మరింత ఎక్కువగా నీటిని విడుదల చేస్తాయి. ఫలితంగా నీళ్ల విరేచనాలు పట్టుకుంటాయి.

నిద్రకు భంగం

కొవ్వు పదార్థాలు పగటిపూట హుషారు తగ్గేలా చేయటమే కాదు, రాత్రిపూట నిద్ర సరిగా పట్టకుండానూ చేస్తాయి. కొవ్వులు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి శరీరం విశ్రాంతి తీసుకోవటంలోనూ అడ్డుతగులుతాయి. ఇలా రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల మర్నాడూ నిద్రమత్తుగా అనిపిస్తుంది.

అలసట, మందకొడితనం

మరీ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తింటే అలసట, మందకొడితనం ఆవహిస్తాయి. దీనికి కారణం కొవ్వు పదార్థాలతో పేగుల్లో పుట్టుకొచ్చే కొన్నిరకాల హార్మోన్లే. ఇవి మెదడు నెమ్మదిగా స్పందించేలా చేస్తాయి. ఫలితంగా హుషారు తగ్గుతుంది.

అధిక బరువు

కొవ్వు పదార్థాలు తినే సమయంలో డొపమైన్, సెరటోనిన్‌ వంటి నాడీ సమాచార వాహక రసాయనాలు పెరుగుతాయి. ఇవి సంతోషం, ఆనందం కలిగించేవి కావటం వల్ల మరింత ఎక్కువ తినేలా చేస్తాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది. కొందరు బరువు తగ్గటానికి అధిక కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారమూ తీసుకుంటుంటారు. అయితే కొవ్వు మోతాదులు సరైన పాళ్లలో లేకపోతే బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు.

ఇవీ చదవండి: ఏ పని చేస్తే.. ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?

కరిగిన కొవ్వులు ఎటు వెళ్తున్నాయి..!

ఆరోగ్యానికి పోషకాహారం- జబ్బులు మటుమాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.