కొవిడ్-19 వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే మద్యం జోలికి వెళ్లకండి. దీంతో రోగనిరోధకశక్తి మందగించి సాంక్రమిక, సాంక్రమికేతర జబ్బుల ముప్పు పెరుగుతుంది మరి. మద్యం శరీరంలోని అన్ని అవయవాలు, కణాల మీద దుష్ప్రభావం చూపుతుంది. దీనికి రోగనిరోధక వ్యవస్థ కణాలూ మినహాయింపేమీ కాదు.
ఉదాహరణకు-ఊపిరితిత్తుల్లోకి హానికారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే రోగనిరోధక కణాలు, సూక్ష్మకేశాలను మద్యం దెబ్బతీస్తుంది. ఇది కరోనా వైరస్ వంటి క్రిములు తేలికగా లోపలికి ప్రవేశించటానికి వీలు కల్పిస్తుంది. అంతేనా? మద్యంతో ఊపిరితిత్తుల కణజాలం, పేగుల్లోని సున్నితమైన పొర సైతం దెబ్బతింటుంది. ఇవన్నీ ఇన్‌ఫెక్షన్ల ముప్పును, తీవ్రతను పెంచేవే.
ఇదీ చదవండి : కరోనాపై పోరుకు భారత్-ఇజ్రాయెల్ సంయుక్త 'రణం'