ETV Bharat / sukhibhava

సెక్స్​లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోతాయా? - సెక్స్

టీనేజీలో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు మొటిమలు రావడం సహజం. వాటిని తొలగించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సెక్స్​లో పాల్గొంటే పురుషుల్లో మొటిమలు తగ్గుతాయా?

can sex reduce pimples
is sex good for your skin
author img

By

Published : May 25, 2022, 8:07 AM IST

యుక్త వయసుకు వచ్చిన తర్వాత మొటిమలు రావడం సహజం. అయితే ఆరోగ్యం పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే రతి క్రీడ.. మొటిమలకు ఔషధంగా పనిచేస్తుందా అనే అనుమానం కొందరిలో ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

"శృంగారంలో పాల్గొంటే మొటిమలు తగ్గిపోవడం జరగదు. సెక్స్​కు మొటిమలకు సంబంధం లేదు. ఎందుకంటే ముందు మొటిమలు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. మొటిమలు రావడానికి కారణం.. ఆండ్రోజెన్స్​. అంటే మేల్ సెక్స్​ హార్మోన్స్​ లాంటివి. టెస్టోస్టిరాన్ లాగా. ఇవి యుక్తవయసులో మొదలవుతాయి. అవి ఎంత ఎక్కువగా విడుదలైతే మొటిమలు అన్ని వస్తాయి. ఆండ్రోజెన్స్ ఆడవారిలోనూ ఉంటాయి. 23-25 ఏళ్లు వచ్చేసరికల్లా ఆండ్రోజన్స్​ తీవ్రత తగ్గిపోతుంది. అప్పుడు మొటిమలూ తగ్గుతాయి. 30 ఏళ్లకు దాదాపు మొటిమలన్నీ పోతాయి. కానీ 18-22 ఏళ్ల మధ్య వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెక్స్​లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోతాయనేది అవాస్తవం." అని చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రజస్వలైతే పెళ్లికి సిద్ధమనేగా.. 18ఏళ్లు వచ్చేదాకా ఎందుకు ఆగాలి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.