ETV Bharat / sukhibhava

యాంటీబయాటిక్స్ అతిగా వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..! - హానికరంగా మారుతున్న యాంటిబయాటిక్‌ అవశేషాలు

యాంటీబయాటిక్‌.. ప్రాణాలు నిలిపే సంజీవని. గత శతాబ్దపు అద్భుత ఆవిష్కరణల్లో ఇదొకటి. మితిమీరిన వినియోగంతో నేల, నీటిలోకి యాంటీబయాటిక్‌ అవశేషాలు చేరుతున్నాయి. ఇవి కొత్త సూక్ష్మజీవుల పుట్టుకకు కారణమై భయంకరమైన వ్యాధులకు కారణమౌతున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

complete information about antibiotics
హానికరంగా మారుతున్న యాంటిబయాటిక్‌ అవశేషాలు
author img

By

Published : Jan 22, 2023, 8:49 AM IST

యాంటీబయాటిక్‌.. ప్రాణాలు నిలిపే సంజీవని. గత శతాబ్దపు అద్భుత ఆవిష్కరణల్లో ఇదొకటి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు వీటివల్ల వైద్యం సులువైంది. క్రమంగా ఈ మందుల వాడకం పెరిగింది. పశువులు, ఆక్వా రంగాలకూ అవి విస్తరించాయి. వ్యాధి నివారణ, చికిత్సకు తోడు జంతువుల ఎదుగుదలకు, ఆహారం ఎక్కువకాలం నిల్వ ఉండేలా చూడటానికి వాటిని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా విసర్జితాల ద్వారా ఈ యాంటిబయాటిక్‌ అవశేషాలు భారీగా పర్యావరణంలోకి చేరుతున్నాయి. తిరిగి మానవులు, జంతువుల్లోకి ప్రవేశించి, చికిత్సకు లొంగని మొండి సూక్ష్మజీవుల పుట్టుకకు కారణమవుతున్నాయి. యాంటీబయాటిక్స్‌ ఉత్పత్తి, వినియోగం అధికంగా ఉన్న భారత్‌, చైనాల్లో ఈ సమస్య ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం మధ్యనాటికి క్యాన్సర్‌ను మించిన పెనుముప్పుగా 'యాంటీబయాటిక్‌ నిరోధకత' మారుతుందని చెబుతున్నారు.

యాంటీబయాటిక్‌

ఏమిటీ యాంటీబయాటిక్‌ నిరోధకత?

యాంటీబయాటిక్స్‌ ప్రభావానికి బ్యాక్టీరియా నశిస్తాయి. నిరంతరంగా వాటి అవశేషాలు శరీరంలోకి చేరడం వల్ల ఆ సూక్ష్మజీవుల్లో జన్యు మార్పులు వస్తాయి. ఫలితంగా అవి యాంటీబయాటిక్స్‌ ప్రభావాన్ని తట్టుకొనే సామర్థ్యాన్ని సంపాదిస్తాయి. వీటిని యాంటీబయాటిక్‌ నిరోధక బ్యాక్టీరియా (ఏఆర్‌బీ)గా పేర్కొంటారు. దీనివల్ల చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లను నయం చేయడమూ కష్టం కావొచ్చు. శస్త్రచికిత్సల్లో ముప్పు పెరుగుతుంది. అంతిమంగా ప్రాణాంతక సూపర్‌బగ్స్‌ రావొచ్చు. అవి మనుషులు, జంతువులకు పెను ముప్పుగా తయారుకావచ్చు.

  • ఈ యాంటీబయాటిక్స్‌ నిరోధకత.. మానవాళి ఎదుర్కొంటున్న మొదటి పది ఆరోగ్య ముప్పుల్లో ఒకటి. దీనివల్ల.. ఒక రోగి ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం 6.4 రోజుల నుంచి 12.7 రోజుల మేర పెరగొచ్చు. ఫలితంగా ఉత్పన్నమయ్యే ఆరోగ్యపరిరక్షణ వ్యయాలు, ఉత్పాదకత నష్టాలు ఒక్క అమెరికాలోనే ఏటా 55 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా.చేరేది ఎలా?
    యాంటీబయాటిక్స్‌లో 40-90 శాతం క్రియాశీల రూపంలోనే మల మూత్రాల ద్వారా విసర్జితమవుతాయి. ఈ అవశేషాలు అంతిమంగా నేల, నీరులోకి చేరుతున్నాయి. ఆ కలుషిత జలాలు మంచినీటిలో కలిసినప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
  • ఈ మందులతో నిండిన పశువుల విసర్జితాలు సేంద్రియ ఎరువు రూపంలో పొలాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా విత్తనం మొలకెత్తడం ఆలస్యమవుతోంది. యాంటీబయాటిక్‌ అవశేషాలు మొక్కల్లోకి ప్రవేశించి, వాటి జీవ ప్రక్రియల్లో జోక్యం చేసుకుంటున్నాయి. పంట దిగుబడిపై ఇది ప్రభావంచూపొచ్చు.
  • మానవుల కన్నా జంతువుల్లోనే యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా మాంసం, చేపల ద్వారా అవి మనుషుల్లోకి చేరుతున్నాయి.
  • కాలం చెల్లిన యాంటీబయాటిక్స్‌ను వ్యర్థ జలాల్లో పారేస్తుంటారు. ఆ అవశేషాలనుశుద్ధి కర్మాగారాల్లో పూర్తిగా వడకట్టడం అసాధ్యం.
  • మున్సిపల్‌ మురుగునీరు, ఆసుపత్రుల వ్యర్థ జలాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఔషధ తయారీ పరిశ్రమలు, పశు పెంపక కేంద్రాలు, చేపల చెరువులు, సేంద్రియ ఎరువు వాడిన పొలాల నుంచి పారే నీటిలో ఈ అవశేషాలు అధికం.
  • 2010తో పోలిస్తే 2030 నాటికి యాంటీబయాటిక్స్‌ వినియోగం 67 శాతం మేర పెరగొచ్చు. బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో అది రెట్టింపు కావొచ్చు.
  • యాంటీబయాటిక్‌ నిరోధకత కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది చనిపోతున్నారని అంచనా.
పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతం

ఈ ప్రాంతాల్లో తీవ్రత..!
పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతం (డబ్ల్యూపీఆర్‌), భారత్‌, చైనాలతో కూడిన ఆగ్నేయాసియా (ఎస్‌ఈఏఆర్‌)ల్లోని వ్యర్థనీటిలో యాంటీబయాటిక్‌ నిరోధకతకు దారితీసే స్థాయిలో అవశేషాలు ఉన్నాయా అన్నదానిపై స్వీడన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన జరిపారు. డబ్ల్యూపీఆర్‌లో 92, ఎస్‌ఈఏఆర్‌లో 45 నమూనాల్లో యాంటీబయాటిక్స్‌ను గుర్తించారు. చైనా, డబ్ల్యూపీఆర్‌లో సిప్రోఫ్లోక్సాసిన్‌ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.

  • అంతకుముందు మరో పరిశోధనలో భాగంగా చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లో కూరగాయలను పరీక్షించినప్పుడు క్వినోలీన్స్‌ తరగతి యాంటీబయాటిక్స్‌ అధిక మోతాదులో కనిపించాయి. శుద్ధి చేయని పాలలో 3 రకాల ఫ్లోరోక్వినోలీన్స్‌, 18 రకాల సల్ఫోనమైడ్‌ యాంటీబయాటిక్స్‌ దర్శనమిచ్చాయి.

కూర్పులో మార్పులు

మన జీర్ణవ్యవస్థలో 800 నుంచి 1000 బ్యాక్టీరియా జాతులు, ఏడువేలకుపైగా ఉపరకాలు ఉంటాయి. వీటిలో 95% ప్రయోజనకరమైనవే. మిగతావాటిలో కొన్ని హానికరమైనవి. మరికొన్ని అవకాశాన్ని బట్టి ప్రయోజనకరంగా, హానికరంగా వ్యవహరిస్తాయి. యాంటీబయాటిక్‌ అవశేషాలు భారీగా పేగుల్లోకి చేరినప్పుడు అక్కడి సూక్ష్మజీవుల కూర్పులో సమతౌల్యం దెబ్బతింటుంది. హానికర బ్యాక్టీరియా పెరగొచ్చు. దీనివల్ల అలర్జిక్‌ రియాక్షన్లు, జీర్ణ సంబంధ రుగ్మతలు, పేగు క్యాన్సర్‌ వంటివి తలెత్తవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.