Best Weight Loss Treatment in Telugu : ఈ ఆధునిక సమాజంలో అందరూ జపిస్తోన్న మంత్రం 'బరువు తగ్గాలి.. నా జూగ్గా మారాలి'. అందుకోసం ఎన్నో రకాల డైట్స్, వర్కౌట్స్ ఫాలో అవుతున్నారు. అయితే.. కేవలం వాటర్ తాగడం ద్వారా బరువు తగ్గే థెరపీ గురించి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ థెరపీ పేరు.. "జపనీస్ వాటర్ థెరపీ(Japanese Water Therapy)". జపాన్ ప్రజలు బరువు నియంత్రించుకోవడానికి ఈ థెరపీని.. పూర్వకాలం నుంచీ ఫాలో అవుతున్నారట. గోరువెచ్చని నీటితోనే ఈ థెరపీని పాటిస్తారు. దీన్ని ఎలా ఫాలోకావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయాలి..
- ఈ పద్ధతిని పాటించేవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నాలుగైదు గ్లాసుల గోరువెచ్చటి నీరు తాగాలి.
- అదే విధంగా బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 45 నిమిషాల ముందు కూడా వాటర్ తీసుకోవాలి.
- ఇక భోజనానికి 15 నిమిషాల ముందు వాటర్ తాగాలి.
- చిరుతిండి కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. ఒకసారి తిన్న తర్వాత మళ్లీ రెండు గంటల వరకూ ఏదీ తినకూడదు.
- వయసు పైబడిన వారు ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా ఒక గ్లాసు నీటితో ఈ వాటర్ థెరపీని ప్రారంభించాలి.
- ఒకవేళ మీరు వరుసగా నాలుగైదు గ్లాసుల నీరు తాగలేకపోతే.. ప్రతి గ్లాసుకూ మధ్య కొంత సమయం తీసుకొని తాగాలి.
- అదేవిధంగా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి.
- రాత్రి నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి.
- ఇలా చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయట.
- ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. నిలబడి తినడం, తాగడం వంటివి అస్సలే చేయకూడదు.
మహిళల్లో అధిక బరువా? కారణం తిండి కాకపోవచ్చు!
జపనీస్ వాటర్ థెరపీ ద్వారా పొందే ప్రయోజనాలు..
- ఓ అధ్యయనం ప్రకారం.. ఈ పద్ధతి ద్వారా పగలు ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
- ఈ థెరపీ స్వీట్ డ్రింక్స్ తాగే అలవాటును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
- ముఖ్యంగా బరువు తగ్గడానికి బాడీలోని క్యాలరీలను తగ్గిస్తుంది.
- మొత్తం జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి, గట్ ఆరోగ్యాన్ని మెరుగపరచడానికి ఈ థెరపీ చాలా ఉపయోగపడుతుంది.
- ఇక మలబద్దకాన్ని నివారించడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హై బీపీ సమస్యను నియంత్రిస్తుంది.
- ఎక్కువ వాటర్ తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాలు క్లీన్ అవుతాయి.
- అయితే.. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఓవర్‌హైడ్రేషన్ సమస్య రావొచ్చు. కాబట్టి ప్రతి గంటకు వారి కెపాసిటీని బట్టి వాటర్ తీసుకోవాలి.
ఈ థెరపీ ద్వారా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కచ్చితంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి. ఎందుకంటే చన్నీళ్లు జీర్ణాశయం, పేగుల్లో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించలేవు. కానీ, వేడి నీళ్లు ఆ పని చేస్తాయి. అందుకే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగడాన్ని జపనీస్ ఎక్కువగా ఇష్టపడతారట. ఫలితంగా కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు.
Weight Loss Tips : అధిక బరువు సమస్యా? టైమ్‌కు భోజనం చేయకపోతే ఇంకా నష్టం!