ETV Bharat / sukhibhava

ఈ 3 పనులు చేస్తున్నారా? - అయితే మీరు త్వరగా ముసలివారు అయిపోతారట! - What Are the Best Anti Aging Tips

Best Anti Aging Tips : వృద్ధాప్యం అందరికీ సహజం. కానీ.. వయసు రాకుండానే ముసలితనం వచ్చేస్తే మాత్రం ఏదో తేడాగా ఉన్నట్టే! దీనికి మనం చేసే తప్పులే కారణమంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఆ 3 తప్పులే ఈ పరిస్థితికి కారణమట!

Premature Aging
Premature Aging
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 11:44 AM IST

Best Tips to Prevent Aging : వయసునూ, కాలాన్నీ ఎవరూ ఆపలేరు. రెండూ పెరుగుతూనే ఉంటాయి. అయితే.. కొందరు ముప్పై, నలభై ఏళ్లకే 50 పైబడినట్టు కనిపిస్తుంటారు. ఇంకొందరు మాత్రం 60 ఏళ్లు వచ్చినా యంగ్​గా కనిపిస్తూ చురుగ్గా పనులు చేసుకుంటుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగానే చాలా మంది ముఖంలో వయస్సు రాకుండానే వృద్ధాప్యపు ఛాయలు(Anti Aging Tips) కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. కానీ.. దీన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉందంటున్నారు. అందుకు మీరు చేయాల్సిందల్లా కొన్ని తప్పులు చేయకుండా ఉండడమే! మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reasons for Premature Aging : ఎవరికైనా వయసు పెరుగుతుందంటే.. అందంగా తరిగిపోతోందని కాస్త భయమే ఉంటుంది. అందుకే చాలా మంది ఎప్పుడూ యంగ్​గా కనిపించేందుకు ఏవేవో క్రీమ్స్, ప్రొడక్ట్స్​ వాడుతుంటారు. వ్యాయామం చేయడం, మంచి డైట్(Best Diet for Look Younger) ఫాలో కావడం వంటివి చేస్తుంటారు. వాటితోపాటు.. కొన్ని పనులు చేయకుండా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు. అవి పాటిస్తే మీరు ఎప్పుడూ యంగ్​ లుక్​లో కనిపిస్తారంటున్నారు. అవేంటంటే..

ఎక్కువగా పని : చాలా మంది సామర్థ్యానికి మించిన పనులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ పనినైనా పట్టుదలతో పాటు క్రియేటివిటీగా చేస్తే త్వరగా పూర్తవ్వడమే కాకుండా శ్రమ కూడా తగ్గుతుంది. అందుకే ఏ పనినైనా స్మార్ట్‌గా ఆలోచిస్తూ పూర్తి చేసుకోండి. అంతేకానీ.. గంటలు గంటలు ఎడతెగకుండా చేయకూడదట!

​అతిగా తినడం : ఇక మనం చిన్న వయసులో ముసలివారిలా కనిపించడానికి మరో ప్రధాన కారణం మనం పాటించే ఆహారపు అలవాట్లు. ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అందంగా కనిపించడంలోనూ డైట్ అంతే కీలకం. అయితే.. ఎంత ఆహారం తినాలో తెలిసి ఉండడం చాలా అవసరమని చెబుతున్నారు. ఫుడ్ ఎక్కువగా తిన్నా, తక్కువగా తిన్నా అంత మంచిది కాదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అతిగా తినడం బంద్ చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా తిన్నారంటే బరువు పెరిగి త్వరగా ముసలివారిలా కనిపిస్తారట!

Health Tips For Woman : మహిళలూ.. బిజీ లైఫ్​లోనూ హెల్దీగా ఉండాలనుకుంటున్నారా?.. ఈ '5' సూత్రాలు పాటిస్తే చాలు!

నిద్ర : ఇది కూడా మనం త్వరగా ముసలివారిలా కనిపించేలా చేస్తుందట. ఎక్కువగా నిద్ర పోవడం.. సరైన నిద్రలేకపోవడం.. ఇవి రెండూ మంచిది కాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల "అకాల వృద్ధాప్యం" వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే రోజూ సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

చివరగా.. ప్రతి ఒక్కరి జీవితంలో వయసుతో పాటు వృద్ధాప్యం రావడం అనేది సహజం. అందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ.. మీరు మనసులో ముసలితనం వచ్చినట్టుగా ఫీల్ అయితే మాత్రం వయసులోనూ ముసలివారిలానే ఫీల్ అవుతారు. కాబట్టి, "థింక్ యంగ్.. స్టే యంగ్.." అంటున్నారు నిపుణులు.

మీ జీవితకాలం మరో పదేళ్లు పెరగాలా? - అయితే ఈ ఆహార పదార్థాలు తినండి!

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.