Anti Aging food in Telugu: వృద్ధాప్యం అనివార్యం. కానీ.. మూడు పదుల వయసులోనే ఆ ఛాయలు కనిపిస్తే.. అందుకు పలు కారణాలు ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితం, జంక్ ఫుడ్, మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి ప్రధానంగా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో.. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయట పడడానికి.. ఏవేవో ఫేస్ ప్యాక్‌లు, ట్రీట్మెంట్‌లు ట్రై చేస్తూ ఉంటారు. కానీ.. సరైన ఫలితం కనిపించదు. ఇలాంటి వారికి విలువైన సూచనలు చేస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు పెరుగుతాయని.. అంటున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!
బొప్పాయి పండు: మగ్గిన బొప్పాయి పండులో(Papaya) విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, బీ, సీ, కే, ఈ లు ఉంటాయి. అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌లు దొరుకుతాయి. ఇవి చర్మం సాగే లక్షణాన్ని నివారిస్తాయి. దీంతో.. ముఖంపై ముడతలు పడటం లాంటి ఇబ్బందులు తొందరగా తలెత్తవు. ఈ పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రకృతిలో సహజంగా దొరికే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లలో గొప్పదని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. ఇన్ని ఔషధ లక్షణాలు ఈ పండులో ఉన్నాయి కాబట్టి.. దీన్ని తరచుగా తింటూ ఉండాలంటున్నారు. ఇది శరీరంలోని మృత కణాలను నాశనం చేస్తుంది. తద్వారా కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్‌తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!
దానిమ్మ : దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడతాయి. దీనిలో ఉండే విటమిన్ C.. చర్మంలో కొత్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
బ్లూబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్స్, సి, ఈ విటమిన్లు మెండుగా ఉండే ఈ పండ్లు ముఖ చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. వాతావరణ కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించడమే కాకుండా, హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను దరిచేరనివ్వవు. సాల్సిలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండి, చర్మంలోని మృతకణాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లలోని సి విటమిన్, యాంతోసయానిన్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది.
షుగర్ పేషెంట్స్ సీతాఫలం తినొచ్చా?-నిపుణుల మాటేంటి!
టమాట: సి విటమిన్, లైకోపిన్ సహా యాంటీఆక్సిడెంట్స్ ఇందులో నిండుగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలు, గీతలను త్వరగా రానివ్వవు. ముఖచర్మాన్ని పొడారనివ్వకుండా ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్‌కు టొమాటో ఔషధంలా పనిచేస్తుంది.
ద్రాక్ష: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షను రోజూ తీసుకోండి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మకణాలను నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడి చర్మానికి సాగే గుణాన్నిస్తాయి.
వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్‌తో యంగ్‌గా కనిపించండి!
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!