ETV Bharat / sukhibhava

మీరు నేల మీద పడుకోవడం లేదా? ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి!

Sleeping on The Floor Benefits : మీరు మెత్తటి పరుపుల మీద పడుకుంటున్నారా..? అయితే ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు! మన శరీరానికి మెత్తగా ఉండే పరుపులు చేసే నష్టం అంతా ఇంతా కాదంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 12:12 PM IST

Benefits of Sleeping on the Floor
Benefits of Sleeping on the Floor in Telugu

Benefits of Sleeping on the Floor in Telugu : ఖరీదైన బెడ్.. దానిపై మెత్తని పరుపు.. అడిషనల్​గా దిండు.. ఇవి లేకపోతే చాలా మందికి నిద్ర రాదు. "మా పరుపు కొనండి.. సుఖాల్లో తేలిపోండి" అంటూ యాడ్స్​లో ఊదరగొడుతుంటాయి పలు కంపెనీలు. కానీ.. ఈ "సుఖం" ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పరుపులన్నీ పక్కన విసిరేసి.. నేలపై బెడ్​షీట్​ వేసుకొని పడుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఎన్నోరకాల అనారోగ్య సమస్యలకు చెక్​ పెట్టొచ్చని.. హెల్దీ లైఫ్​ను లీడ్ చేయొచ్చని అంటున్నారు. మరి.. ఆ వివరాలేంటో చూడండి.

భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!

నేలపై ఇలా పడుకోవాలి: నేలపై చాప లేదా బెడ్ షీట్​ వేసి పడుకోండి. ఒక పక్కకు తిరిగి పడుకోవాలంటే.. ఎడమవైపు తిరిగి పడుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణం కూడా తొందరగా అవుతుంది. నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు ఆక్సీజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. కొంతమందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల నడుము, వీపు, భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.

మృతకణాలు పోయి ముఖం అందంగా మారాలా? ఈ స్క్రబ్బర్స్​తో ప్రాబ్లం సాల్వ్​!

వెన్నునొప్పికి చెక్: మీకు స్ట్రెస్ లేదా ఇతర కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుందా? అయితే.. ఈ సమస్యకు చెక్​ పెట్టాలనుకుంటే మీరు నేలపై పడుకోండి. నిద్ర భంగిమల్లో మార్పుల వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశముంది. అయితే.. నేల మీద పడుకోవడం వల్ల మీ నిద్ర భంగిమ కరెక్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా.. మీ హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్​కు ఉపశమనం లభించి.. నడుము నొప్పి తగ్గుతుంది.

కరెక్ట్ పోస్టర్: చాలా మంది నిటారుగా కాకుండా.. వంగి కూర్చోంటారు. ఇలాంటి పోస్టర్​ మీకు నడుము నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారుతుంది. ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడుకోవడం ఉత్తమం. ఇది మీ మెడ, తలను సరైన అమరికలోకి తీసుకువస్తుంది. తద్వార మీ భంగిమ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

వాకింగ్‌, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్‌ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!

మెరుగైన నిద్ర కోసం: పనిలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్ర లేమి సమస్య వల్ల చేసే పనిపై శ్రద్ధ పెట్టలేము. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల మీరు మెరుగైన నిద్ర పొందవచ్చు. మొదట్లో ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించినా.. తర్వాతి రోజుల్లో మీరే ఛేంజ్ చూస్తారు.

వేడి తగ్గుతుంది..: చలికాలంలో వేడిగా ఉంటే మంచిదే కానీ.. శరీరంలో వేడి ఎక్కువైతే.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాతవరణం వేడిగా ఉండడం వేరు.. శరీరంలో వేడి ఉండడం వేరు. ఈ సమస్యతో మీరు పరుపుపై పడుకుంటే.. దాని నుంచి వచ్చే వేడి కూడా మీకు ఇంకా చిరాకు, ఇబ్బందిని కలిగిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రతలు నార్మల్ అవుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. పరుపు మీద పడుకోవడం తప్పేమి కాదు కానీ.. నేలపై పడుకోవడం వల్ల మీరు చాలా లాభాలు పొందవచ్చు.

బీట్‌రూట్‌ ఇలా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు దూరం!

చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్​ ప్యాక్స్​తో కోమలంగా మారిపోతాయి!

అవాంఛిత రోమాలా? ఆందోళన వద్దు! ఈ ప్యాక్స్​ ట్రై చేస్తే ప్రాబ్లెమ్​ సాల్వ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.