Benefits of Eating Jaggery and Turmeric in Morning: చలికాలంలో ఎముకలు కొరికే చలిని తట్టుకోవడం చాలా కష్టం. దీన్ని తట్టుకునే శక్తిని శరీరానికి మనమే ఇవ్వాలి. ఉన్ని దుస్తులు వేసుకోవడం.. రగ్గులు కప్పుకోవడం ద్వారా శరీరాన్ని కొంతమేర కాపాడుకోవచ్చు. కానీ.. ఆహారం ద్వారా మరింత శక్తిని అందించవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు! ప్రతిరోజూ ఉదయం చిన్న బెల్లం ముక్క, పసుపు తింటే ఎంతో మంచిదని.. ఇది చలికాలంలో శరీరాన్ని కాపాడుతుందని.. రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతోపాటు పలు విధాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుందిని అంటున్నారు. అయితే.. పసుపు, బెల్లం ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఇవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
శీతాకాలంలో మీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినాల్సిందే
బెల్లం: క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. వంటి ఖనిజాలు ఇందులో ఉన్నాయి. బి-కాంప్లెక్స్, ‘సి’, ‘డి 2’, ‘ఇ’.. వంటి విటమిన్లు నిండి ఉన్నాయి. ఈ బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం.. ఇలా బెల్లం చేసే మేలు ఎంతో!
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనిలో శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలు ఉంటాయి. శరీరంలో కనిపించని వాపు, వివిధ ఆరోగ్య సమస్యలను ఇది తగ్గిస్తుంది. బెల్లం, పసుపు ఈ రెండూ కలిసి శరీరానికి మెరుగైన ప్రయోజనాలు అందిస్తాయి. ఎన్నో రకాల సమస్యలు తొలగిస్తాయి.
పసుపు, బెల్లం కలిపి తింటే:
మెరుగైన జీర్ణప్రక్రియ: పసుపు, బెల్లం కలిసి జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. పేగు కదలికలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
మీరు పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? - ఆ నష్టం గ్యారెంటీ!
కాలేయం: కాలేయం పనితీరుకు పసుపు చాలా అవసరం. బెల్లంలో విష పదార్థాలను బయటికి పంపించే శక్తి ఉంటుంది. కాబట్టి కాలేయం శుభ్రపడుతుంది.
ఇమ్యూనిటీ డెవలప్: రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి పసుపు చాలా అవసరం. బెల్లంలో ఇనుముతో పాటు అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఎంత తీసుకోవాలి? : ప్రతిరోజూ ఉదయాన్నే.. చిటికెడు పసుపు, అర స్పూను బెల్లం కలిపి.. చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసుకోవాలి. వీటిని ఇంటిల్లిపాదీ తీసుకుంటే.. శరీరంలో ఉన్న వ్యర్ధాలన్నీ బయటికి వెళ్లిపోతాయని.. ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం ఆయుర్వేద నిపుణుల ప్రకారం అందిస్తున్నాము. కేవలం అవగాహన కోసం మాత్రమే.
చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు- ఈ జాగ్రత్తలతో చెక్ పెట్టండిలా!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తున్నారా? బీ కేర్ ఫుల్- ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే!