ETV Bharat / sukhibhava

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి! - tips to better sleep

Do You Want Better Sleep in Night: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం.. ఉదయాన్నే త్వరగా నిద్రలేవడంతో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోంటున్నారు. అయితే రాత్రిళ్లు నిద్రపోవడానికి ముందు తీసుకునే ఆహార పదార్థాలు నిద్రపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి నిద్రకు ముందు మనం తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Do You Want Better Sleep in Night
Do You Want Better Sleep in Night
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 1:34 PM IST

Avoid These Foods to Better Sleep in Night: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన తిండితో పాటు ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇలా పలు రకాల కారణాల వల్ల చాలా మంది నిద్రకు దూరమైపోతున్నారు. నిద్రలేమి సమస్య ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే రాత్రుళ్లు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. దీనితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం, బీపి అదుపులో ఉండటం, చర్మానికి మెరుపు... ఇలా చాలా రకాలుగా మేలు జరుగుతుంది. కాగా, నిద్రకు ముందు మనం తీసుకునే ఆహారాలు లేదా పానీయాలు మన నిద్రను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి నిద్రకు ముందు మనం తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా? - అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!

స్పైసీ ఫుడ్స్: చాలా మంది రాత్రి సమయాల్లో స్పైసీ ఫుడ్​ను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే మనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ముందుగా స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్స్, మసాలాలు తినడం వల్ల పొట్టలో సమస్యలు వస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను కూడా కలిగిస్తుంది. అలాగే నిద్రకు భంగం కలిగిస్తుంది. మీకు ఇప్పటికే గుండెల్లో మంట ఉంటే స్పైసీ ఫుడ్స్‌కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

కూరగాయలు: కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. రాత్రిపూట కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి రాత్రిపూట వీటిని తింటే నిద్రకు భంగం కలుగుతుంది.

ఉసిరితో జీర్ణసమస్యలు దూరం! ఇంకెన్నో లాభాలు- రోజుకు ఒకటి తింటే చాలు!

ప్రాసెస్డ్ ఫుడ్స్: ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, బర్గర్స్ వంటివి రాత్రి పడుకునే ముందు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారాలు అజీర్తిని కలిగిస్తాయి. రాత్రిపూట ఇటువంటి ఆహారాలు విరేచనాలకు కూడా కారణమవుతాయి.

తియ్యటి ఆహారాలు: ఐస్​క్రీం, జ్యూస్​లు, స్వీట్లు, తీపిని అధికంగా కలిగి ఉండే ఇతర ఆహారాలు తినడం వల్ల ఎనర్జిటిక్​గా ఉంటారు. తద్వారా మీరు నిద్రకు దూరమవుతారు. కాబట్టి నైట్​ టైమ్​లో స్వీట్స్​కు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!

ఫాస్ట్ ఫుడ్స్ అండ్​ ప్యాకెట్ ఫుడ్స్: ఈ రోజుల్లో ఫాస్ట్​ఫుడ్ సంస్కృతి ప్రజల్లో పెరిగింది. ఇంట్లో వండుకోలేక బయట ఫాస్ట్​ఫుడ్​ సెంటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని తినడం వల్ల సరిగా జీర్ణం అవ్వక నిద్రకు దూరం అవ్వాల్సి వస్తుంది.

టీ, కాఫీ: రాత్రి సమయంలో టీ, కాఫీ లాంటి డ్రింక్స్ తాగితే ఎనర్జిటిక్​గా ఉంటారు. కాబట్టి నిద్రకు భంగం కలుగుతుంది.

గమనిక: పైన చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా తీవ్ర సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం..

ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్​కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.