ETV Bharat / sukhibhava

మాస్క్​తో మార్నింగ్​ వాక్​.. చాలా డేంజర్​!​

చాలామందికి మార్నింగ్​ వాక్​, జాగింగ్ లాంటి​ అలవాట్లు ఉంటాయి. అందుకోసం పార్కులు, గ్రౌండ్లకు వెళ్తూంటారు. అయితే ఈ కరోనా కాలంలో కాలు బయటపెట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా మారింది. దీంతో తమకు రక్షణగా​ మాస్కులు పెట్టుకునే జాగింగ్​​ చేసేస్తున్నారు కొందరు. కానీ ఇలా మాస్కులు ధరించి పరిగెత్తడం ప్రాణానికే ప్రమాదమంటున్నారు వైద్యులు. ఎందుకో తెలుసా..?

Running or having morning walk in mask can  be harmful to health says Chandigarh Cardiologist
మాస్క్​తో మార్నింగ్​ వాక్​.. చాలా డేంజర్​!​
author img

By

Published : May 21, 2020, 10:40 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

మాస్కులతో వాకింగ్​, జాగింగ్​ చేస్తే ప్రాణానికే ముప్పంటున్నారు ఛండీగఢ్​కు చెందిన ప్రముఖ హృద్రోగ వైద్యుడు డా. యశ్​పాల్​ శర్మ. ప్రస్తుత విపత్తు కాలంలో మాస్కులు కరోనా నుంచి కాపాడుతున్నాయి. కానీ వాటిని ఎప్పుడు, ఎలా వినియోగించాలో తెలుసుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే అంటున్నారు.

ఇందుకే వద్దు..

లాక్​కడౌన్ సడలించినప్పటి నుంచి.. జనం మాస్కులు పెట్టుకుని మార్నింగ్​ వాక్​లకు వెళ్తున్నారు. అయితే అదే పొరపాటు అంటున్నారు వైద్యులు.

పరిగెత్తినప్పుుడు లేదా వేగంగా నడిచినప్పుడు రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దీంతో గుండెకు అదనపు ఆక్సిజన్​ కావల్సివస్తుంది. అందుకే పరుగు తీశాక ఆయాసం వస్తుంది. అంటే ఎక్కువసార్లు ఊపిరి పీలుస్తూ ఆక్సిజన్​ను ఊపిరితిత్తుల్లోకి పంపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాస్క్​ అడ్డుగా ఉంటే.. శరీరం డిమాండ్​ చేస్తున్న ఆక్సిజన్​ అందదు.

ఆక్సిజన్​ తగ్గితే ఏమవుతుంది?

ఆక్సిజన్​ అంటే ప్రాణాయువు. మరి ఆ ఊపిరే లేకపోతే.. ఏమవుతుందో వేరే చెప్పాలా? ముందు మెదడుపై ప్రభావం పడుతుంది. తర్వాత, రక్తాన్ని శుద్ధి చేసే గుండె పనితీరు దెబ్బతింటుంది. దీంతో గుండెపోటు వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయి.

ఏం చేయాలి?

కరోనాను ఎదుర్కోవాలంటే మాస్కులు లేకుండా బయటికి వెళ్లొద్దు. కానీ వ్యాయామం చేసేటప్పుడు మాత్రం మాస్కులు ధరించొద్దు. జనాలు లేని చోట, చెట్లు బాగా ఉన్న చోట ఆక్సిజన్​ సరిపడా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మాస్క్​ తీసేసి ఊపిరి పీల్చుకోవాలి. దీంతో శరీరంలోని ఆక్సిజన్​లోటు సమతుల్యమవుతుంది.

ప్రతిరోజు గట్టిగా శ్వాస తీసుకోవడం వల్ల.. ఆరోగ్యంగా ఉంటారంటున్నారు డా. యశ్​పాల్​.

ఇక ప్రతి ఒక్కరు ఎన్​-95 మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఎక్కువ జన సమూహంలో ఉండేవారు, కరోనా రోగులకు సమీప ప్రాంతాల్లో నివసించేవారు మాత్రం ధరిస్తే చాలు. ప్రమాదం ఎక్కువ లేని చోట సాధారణ, పలుచటి సర్జికల్​ మాస్క్​, లేదా ఇంట్లో కుట్టిన ఖాదీ మాస్కులు వాడాడం ఉత్తమం.

ఇదీ చదవండి:పోయేలోపు పద్ధతులన్నీ నేర్పే పోతా: కరోనా

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.