చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లా కమ్మవారిపల్లెకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కడప సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నీలకంఠ అనే యువకుడు వాట్సప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గుంటూరు లా కళాశాలకు చెందిన విద్యార్థిని బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్టేషన్కు రావాల్సిందిగా నీలకంఠను ఆదేశించారు.
తనకు సంబంధం లేని కేసులో బాధ్యులను వదిలేసి తనను స్టేషన్కు పిలుస్తున్నారని మనస్థాపం చెంది..నీలకంఠ శుక్రవారం రాత్రి విషద్రావణం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబసభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా..ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. విచారణకు సహకరించకుండా కేసును తప్పుదోవ పట్టించి, పోలీసులను బెదిరించే ప్రయత్నంలో భాగంగానే యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీచదవండి