కడప శివారులో భాకరపేట వద్ద రైలు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడప తిలక్ నగర్ కు చెందిన నగేష్ తోటి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు.. భాకరపేట వద్ద నగేష్ రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: కడప రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం