సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి పలువురు వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
అమరావతి ప్రజా వేదికలో సీఎం చంద్రబాబును కలిసిన పలువురు నెల్లూరు జిల్లా నేతలు తెదేపా కండువా కప్పుకున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ శాసనసభ సభ్యులు బొల్లినేని కృష్ణయ్య, కొమ్మి లక్ష్మినాయుడు, నెల్లూరు సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ ధనంజయ రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. తెలుగురైతు అధ్యక్షులు కె.విజయ రామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరు మండల వైకాపా నాయకులు, అమరావతి ప్రజావేదికలో సీఎం చంద్రబాబును కలసి తెదేపాలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రైల్వే కోడూరు మండల వైకాపా అధ్యక్షుడు కృష్ణంరాజు, నారాయణరెడ్డి, బాల్ రెడ్డి, ప్రసాద్, రాజేంద్రరాజు తెదేపాలో చేరారు.
చిత్తూరు జిల్లా నుంచి తెదేపాలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ దొరబాబు సహా, జిల్లాలో పలు సీనియర్ నేతలు తెదేపాలో చేరారు. వీరిలో మాజీ శాసనసభ్యులు ఎ.ఎస్.మనోహర్, బలిజ సంఘం నాయకులు ఈ. శ్రీనివాసరావు, పట్టణ మినీ లారీ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు అమర్ నాథ్, యువజన నాయకుడు కిషోర్ కుమార్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు బాబిరెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు పి. రమేష్ , బీసీ సెల్ అధ్యక్షులు జి.శేఖర్ లను చంద్రబాబు.. తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
తెదేపాలోకి కొనసాగుతోన్న చేరికలు - CDP
కడప జిల్లా రైల్వే కోడూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పలువురు వైకాపానేతలు తెదేపాలో చేరారు.