కొవిడ్ సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులను తొలగించటం దారుణమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కడప అధ్యక్షుడు సుంకర రవి అన్నారు. తొలగించిన 170 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దాదాపు పది నెలల పాటు ప్రాణాలను పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు పనులు చేస్తే .. ఇప్పుడు అధికారులు వారిని తొలగించడం దారుణమని సుంకర రవి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కడప జిల్లాలోనే నగరపాలక అధికారులు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఉన్నఫలంగా తొలగించడం వల్ల 170 మంది కుటుంబాలు వీధిన పడ్డాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ఆ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'