women murder: కడప జిల్లా పులివెందులలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పులివెందుల పట్టణంలోని మెయిన్ బజార్‌లోని రమణా రెడ్డి ఎలక్ట్రికల్ దుకాణంలో ఉన్న మహిళను.. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. షాపు పైఅంతస్తులో.. రిజ్వాన తన భర్తతో కలిసి నివాసముంటున్నారు. అయితే అనంతపురం జిల్లా కదిరికి చెందిన హర్షవర్ధన్ అనే వ్యక్తికి రిజ్వానాకు వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచు రిజ్వానాను హర్షవర్ధన్ వేధిస్తుండటంతో.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హర్షవర్ధన్ రిజ్వానపై కక్ష పెంచుకుని.. దారుణంగా హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: Employees Protest: ఈనెల 7 నుంచి జనవరి 6 వరకు నిరసనలు.. సీఎస్‌కు తెలిపిన ఉద్యోగ సంఘాలు