ETV Bharat / state

ఆందోళనలో కుటుంబం.. అండగా నిలిచి మానవత్వం చాటుకున్న తహసీల్దార్​

author img

By

Published : Feb 19, 2023, 10:28 PM IST

Woman dies in temple premises: వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతలలోని మల్లేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందిన మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు తన సొంత ఖర్చుతో అంబులెన్స్ ఏర్పాటు చేసి.. స్వగ్రామం పంపించారు.

crime
నేరాలు

Woman dies in temple premises in AP: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ కుటుంబమంతా.. ఊరు కాని ఊరు వచ్చారు. ఎంతో సంతోషంగా గడిపారు. కానీ అనుకోని విపత్తు ఆ కుటుంబంలో జరిగింది. ఏం చేయాలో దిక్కుతోని స్థితిలో ఉన్నారు. ఎవరు సాయం చేస్తారో తెలియని పరిస్థితి.. ఇలాంటి సమయంలోనే ఓ తహసీల్దార్​ మానవత్వం చాటుకున్నాడు. అందరిచేత మన్ననలు అందుకున్నాడు.

కర్నూలు జిల్లా బేతంచర్ల నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పొలతల మల్లేశ్వర స్వామి ఆలయానికి ఆ కుటుంబం వచ్చింది. అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆ కుటుంబంలోని మహిళ దేవాలయ సమీపంలో మృతి చెందారు. ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఉదయ భాస్కర్ వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అంబులెన్స్​ రప్పించడంతో పాటు ఆ మహిళ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు.

వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతల మల్లేశ్వర స్వామి శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన మహిళ మృతి చెందారు. కుటుంబసభ్యులు మృతురాలిని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. ఆలయ సిబ్బంది, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు.. తన సొంత ఖర్చులతో అంబులెన్స్​ను పిలిపించారు.

తహసీల్దారే స్వయంగా మృతదేహాన్ని అంబులెన్స్​లో ఎక్కించి స్వగ్రామానికి పంపారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా వారి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఇంటికి వెళ్లడానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి ఉదయ భాస్కర్ రాజు సహాయం చేయడంతో.. ఆయనను స్థానికులు అభినందించారు.

మానవ విలువలు మంటగలసిపోతున్న నేటి రోజుల్లో.. తహసీల్దార్ ఉదయ భాస్కర్ మంచి మనస్సు చాటుకున్నారంటూ స్థానికులు పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది కానీ, ఆలయ చైర్మన్, ఈవో ఎవరూ పట్టించుకోలేదంటూ కుటుంబసభ్యులు వాపోయారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.