విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఏ ఆక్మసికంగా మృతి చెందారు. కడప జిల్లా రాయచోటిలో కొవిడ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న వీఆర్ఏ కృష్ణయ్య (55) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన రెవెన్యూ, పురపాలిక సిబ్బంది సపర్యలు చేసిన వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పటివరకు తమతో పాటే కలిసి పనిచేసిన వీఆర్ఏ... ప్రాణాలు వదలటంపై తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హామీఇచ్చారు.
ఇదీ చదవండి: