దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా... తమ గ్రామంలో ఇసుకను తరలిస్తూ టిప్పర్లు తిరుగుతున్నాయంటూ కడప జిల్లా కమలాపురంలో వాటిని అడ్డుకున్నారు. ఈ టిప్పర్ల రాకపోకల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 10 టిప్పర్లు ఇసుకను తరలిస్తుండగా... అందులో కేవలం మూడింటికే నంబర్ ప్లేట్లు ఉన్నాయన్నారు. గ్రామస్తులందించిన సమాచారం మేరకు పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. ఏపీఎమ్డీసీ నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఉందని గ్రామస్థులకు తెలియచేశారు. పోలీసులు చెప్పినప్పటికీ.. టిప్పర్ల రాకపోకలను గ్రామస్థులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి: