ETV Bharat / state

వ్యవసాయంపై కాలుష్య కొరలు - కాలుష్యం వల్ల వ్యవసాయం బంద్

కడప జిల్లాలోని యురేనియం పరిశ్రమ కాలుష్యం వల్ల వేముల మండలంలోని ప్రభావిత 7 గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొందరు భూములను బీళ్లుగానే వదిలేస్తున్నారు. యురేనియం ప్రభావిత గ్రామాలకు సాగు నీటిని అందించేందుకు నిర్మించాల్సిన ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. నిధుల మంజూరులో జాప్యం వల్ల పనులు ప్రారంభం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Uranium
వ్యవసాయంపై కాలుష్య కొరలు
author img

By

Published : Jul 8, 2021, 9:07 AM IST

ప్రభావిత గ్రామాల కోసం ఎత్తిపోతల నిర్మాణంలో జాప్యం
అప్పులతో కుదేలవుతున్న బాధిత రైతులు

కడప జిల్లాలోని యురేనియం ప్రభావిత గ్రామాలకు సాగు నీటిని అందించేందుకు నిర్మించాల్సిన ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. నిధుల మంజూరులో జాప్యం వల్ల పనులు ప్రారంభం కావడం లేదు. దీంతో కాలుష్యం బారిన పడిన వేముల మండలంలోని 7 గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను నిల్వ చేసే టెయిల్‌పాండ్‌ నిర్మాణంలో నిబంధనలను గాలికి వదిలేయడంతో భూగర్భ జలం కలుషితమవుతోంది. ఫలితంగా ఆ భూముల్లో పంటలు సాగు చేసే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొందరు భూములను బీళ్లుగానే వదిలేస్తున్నారు.

బోరు నీరు కలుషితం

వేముల మండలం తుమ్మలపల్లెలో ప్రపంచంలోనే అత్యధికంగా యురేనియం నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు 4 గ్రామాల్లోని 2,240 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించారు. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (UCIL) ఆధ్వర్యంలో 2007లో పనులు ప్రారంభించి 2012 నాటికి కర్మాగారంలో ఉత్పత్తి మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 3వేల టన్నుల యురేనియం ఉత్పత్రి చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని 4500 టన్నులకు పెంచేందుకు యూసీఐఎల్‌ ప్రయత్నిస్తోంది. కర్మాగారంలో యురేనియం వెలికితీత, శుద్ధి సందర్భంగా వ్యర్థాలు వెలువడుతాయి. వాటిని కేకే కొట్టాలలో ఏర్పాటు చేసిన టెయిల్‌పాండ్‌కు తరలించి అక్కడి నుంచి సంపుల్లోకి పంపి శుద్ధి చేసి తిరిగి పరిశ్రమ అవసరాలకే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో టెయిల్‌పాండ్‌లో కొంత మేర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇవి భూగర్భంలో కలిసిపోకుండా టెయిల్‌పాండ్‌ చుట్టూ నిబంధనల మేరకు లైనింగ్‌ చేపట్టాల్సి ఉంది. కాని నిర్దిష్ట ప్రమాణాలను విస్మరించి టెయిల్‌పాండ్‌ను ఏర్పాటు చేయడంతో పరిసరాల్లో భూగర్భ జలం కలుషితమవుతోంది. ఇప్పటికే పులివెందుల మండలం కణంపల్లె, వేముల మండలం కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కోట గ్రామాల్లో కాలుష్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వీటి పరిధిలో బోర్ల ద్వారా అత్యధికంగా పంటలు సాగు చేస్తుంటారు. అయితే వాటిలోని నీరు కలుషితం కావడంతో పంటలు దెబ్బతింటున్నాయి.

పరిపాలనా అనుమతులు వచ్చినా..

కమిటీల అధ్యయనాల ద్వారా యురేనియం బాధిత గ్రామాల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంది. పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూగర్భ జలం కలుషితమవుతున్నట్లు నిర్ధారించి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. యురేనియం బాధిత 7 గ్రామాలకు సాగునీటి సరఫరా కోసం రూ.1,113 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వేంపల్లె మండలంలోని గిడ్డంగివారిపల్లె వద్ద 1.20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలని, లింగాల మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి ఎర్రబల్లె చెరువుకు, అక్కడి నుంచి వేంపల్లె మండలంలోని గిడ్డంగివారిపల్లెలో కొత్తగా నిర్మించే జలాశయానికి నీటిని తరలించాలని ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా 7 గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టుకు సూక్ష్మ సేద్యం పద్ధతిలో నీరందించాల్సి ఉంటుంది. ఈ పథకం నిర్మాణానికి గతేడాది ఆగస్టు 26న పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఉత్తర్వులు వెలువడి టెండర్లు పూర్తయినా ఇప్పటికీ పనులను ప్రారంభించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. రుణాలను సేకరించి చేపడతామని అధికారులు అంటున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు.

ఏడాదికే డ్రిప్‌ పరికరాలు దెబ్బతిన్నాయి..

- లింగేశ్వరయ్య, కేకే కొట్టాల గ్రామం, వేముల మండలం

నాకు టెయిల్‌పాండ్‌ సమీపంలోనే 3.8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూగర్భ జలం కలుషితమై ఎంతో నష్టపోతున్నాం. బోరు నీరు నేలపై పారి ఆరిపోయాక తెల్లటి రసాయన పదార్థం పేరుకుపోతోంది. సాధారణంగా డ్రిప్‌ పరికరాలను 4-5 ఏళ్ల వరకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటిలో రసాయన పదార్థాలు పేరుకుపోయి ఏడాదికే నిరుపయోగమవుతున్నాయి. త్వరగా స్వచ్ఛమైన సాగు నీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

రూ.10 లక్షలు అప్పు చేశా

- నాగేంద్ర, కేకే కొట్టాల గ్రామం, వేముల మండలం
నాకు నాలుగెకరాలుంది. మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. యురేనియం పరిశ్రమ కాలుష్యంవల్ల ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ఇటీవల రూ.3 లక్షల పెట్టుబడితో అరటి వేస్తే భూగర్భ జలం కలుషితం కారణంగా గెలలు దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. పంటను అమ్మితే రూ.50 వేలే వచ్చాయి. ఇప్పటి వరకు వ్యవసాయానికి రూ.10 లక్షలు అప్పు చేశా. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా భవిష్యత్తు అంధకారమే.

త్వరలో పనుల ప్రారంభానికి కృషి

- శ్రావణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీరు, సాగునీటి ప్రాజెక్టులు, కడప
యురేనియం బాధిత గ్రామాలకు సాగునీటి సరఫరాకు ఉద్దేశించిన పథకం నిర్మాణం కోసం టెండర్లను పూర్తిచేశాం. ఈపీసీ విధానంలో ఎంఆర్‌కేఆర్‌ సంస్థ పనులను దక్కించుకుంది. మార్చి 8న ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే సర్వే, ఆకృతుల రూపకల్పన కొనసాగుతోంది. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. ప్రత్యేకంగా రుణాలు తీసుకొచ్చి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తాం.

ఇది చదవండి :

Union Cabinet: మోదీ ప్రభుత్వంలో​ మంత్రులు- వారి శాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.