మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్.. యూపీ, బిహార్‌ని మించిపోతోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు చెప్పింది. గత నాలుగైదేళ్లలో దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కేంద్ర హోం శాఖ... లైంగిక వేధింపుల్లో అగ్రభాగాన నిలిచినట్లు స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
2018తో పోల్చితే.. 2021 నాటికి మహిళలపై అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం, లైంగిక వేధింపులు 31 శాతం పెరిగాయని కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. 2018 నుంచి 2021 మధ్య కాలంలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు.. 18,883 సాధారణ దాడులు జరిగాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018లో అత్యాచార ఘటనలు 971 ఉంటే... 2019లో 1086, 2020లో 1095, 2021లో 1188 ఘటనలు జరిగినట్లు పేర్కొంది. అదే సందర్భంలో దాడులు 2018లో 4,445 ఉంటే... 2021లో 5,108 జరిగాయని, లైంగిక వేధింపులు 2018లో 1802.. 2019లో 1892... 2020లో 2,342... 2021లో 2,370 ఘటనలు చోటు చేసుకోగా... హత్యలు కూడా పెరుగుతున్నట్లు హోం శాఖ పేర్కొంది. ఈ కాలంలో యాసిడ్ దాడులు మాత్రం తగ్గినట్లు లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది.
ఇవీ చదవండి: