కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, మున్సిపల్ నైట్ షల్టర్లు, ఇతర సముదాయాలను డీఎస్పీ ఎల్.సుధాకర్ నేతృత్వంలో సోదా చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కస్టమర్ల వివరాల నమోదును పరిశీలించారు. తనిఖీలలో ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం కలిగి ఉన్న బెంగుళూరుకు చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుంచి రెండు కేజీల 262 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించినట్లు డిఎస్పీ ఎల్. సుధాకర్ తెలిపారు. చట్టవిరుద్ధంగా వ్యాపారాలు ఎవరు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: