కడప జిల్లాలో ఆక్సిజన్ అందక ఇద్దరు కొవిడ్ బాధితులు మృతి చెందారు. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన మహిళతో పాటు, ప్రొద్దుటూరు పట్టణం ఆశ్రమం వీధిలో ఉంటున్న మరో వ్యక్తి ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ రోజు తెల్లవారుజామున ఆక్సిజన్ పైపు పగిలిపోయిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మృతులు ఆక్సిజన్ అందక మృతి చెందలేదని.. తీవ్ర అనారోగ్యంతో చనిపోయారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా?: హైకోర్టు