నకిలీ తుపాకీతో బెదిరించి కిడ్నాప్‌కు యత్నించారనే ఆరోపణలపై బద్వేలుకు చెందిన మండెం పవన్‌కుమార్, కొలిశెట్టి పవన్‌కుమార్‌లను అరెస్ట్ చేసినట్టు కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ బి.విజయ్‌కుమార్ తెలిపారు. వీరి నుంచి నకిలీ తుపాకీతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బద్వేలులోని అమ్మవారిశాల వీధికి చెందిన మండెం పవన్‌కుమార్‌కు గోపవరం మండలం బెడుసుపల్లెలో భూమి ఉంది.
పక్కనే ఉన్న పొరంబోకు భూమిని బెడుసుపల్లె గ్రామానికి చెందిన పల్లెం నారాయణరెడ్డి సాగు చేసుకుంటున్నారు. పొరంబోకు భూమి విషయమై పవన్‌కుమార్, నారాయణరెడ్డికి మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్నట్లు తెలిపారు. ఈనెల 6న పవన్‌కుమార్ తన స్నేహితుడైన కొలిశెట్టి పవన్ కుమార్‌తో కలిసి నకిలీ తుపాకితో నారాయణరెడ్డిని బెదిరించి కిడ్నాప్ యత్నం చేశాడు. అతను కేకలు వేయడంతో వెళ్లిపోయినట్లు తెలిపారు. నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు మండెం పవన్‌కుమార్, కొలిశెట్టి పవన్‌కుమార్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ తుపాకి, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: