Tulasi Reddy condemns on throwing stones: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో తెలుగుదేశం చేపట్టిన బాదుడేబాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద దుండగులు రాయి విసరడంపై.. పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుకు రక్త గాయం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సక్రమంగా లేదనడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని వెల్లడించారు. నిదితుడిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలన్నారు.
పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం..
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పేద ఇళ్లను ప్రభుత్వం జేసీబీలతో కూల్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్, ఎర్రచందనం... మాఫియాలు వీర విహారంగా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మాఫియా వీటికి తోడైందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్లో కేజీ బియ్యం రూ. 35కు కొని, సబ్సిడీ బియ్యం పథకం ద్వారా కేజీ బియ్యం రూ.1కి సరఫరా చేస్తున్నాయని తెలిపారు.
నెలకు దాదాపు 2 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయని.. ఇందులో ప్రతి నెల 1.5 ఐదు లక్షల టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆరోపణలు చేశారు. దీనికి ప్రధానంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవడమేనని ఆయన వెల్లడించారు. సబ్సిడీ బియ్యం పథకం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని తెలిపారు. బ్లాక్ మార్కెట్‌ను నిరోధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తులసి రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి: