మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 72వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. విచారణ ముగించుకుని బయటకు వైఎస్ భాస్కర్‌రెడ్డి వెళ్లిపోయారు. మరోవైపు.. కడప జైలులో విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ మనోహర్‌రెడ్డి పులివెందుల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
అంతకు ముందు...
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు సోమవారం వరకు... పది రోజుల పాటు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్లారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పది రోజులపాటు పులివెందులలోని పలువురు అనుమానితుల ఇళ్లల్లో ఆయుధాలు, దుస్తులు, వస్తువులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజులపాటు విచారణలో కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.
సీబీఐ పిటిషన్..
సునీల్ యాదవ్ కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతి కోరుతూ.. సీబీఐ అధికారులు పిటిషన్ ధాఖలు చేశారు. అందుకు సునీల్‌యాదవ్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రిమాండ్ గడువు రెండ్రోజులే ఉండటంతో కస్టడీకి నిరాకరించిన కోర్టు.. విచారణ రేపటికి వాయిదా వేసింది. సునీల్ ఈనెల 18 వరకు రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉండనున్నారు.
ఇదీ చదవండి:
Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు