సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా పుల్లంపేట మండలం కేతరాజు పల్లిలో చోటు చేసుకుంది. పుల్లంపేట మండలం వత్తలూరు అగ్రహారానికి చెందిన నారాయణ, ప్రశాంతిల కుమారుడు భరత్(12) ఆరో తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం కేతరాజు పల్లెలోని మేనమామ ఇంటికి వచ్చాడు. గ్రామంలో కొందరు యువకులతో కలిసి సరదాగా రాజుల మడుగు వద్దకు ఈతకు వెళ్లాడు. భరత్‌కు ఈత రాకపోవటంతో ఎక్కువ లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. విషయం గమనించిన యువకులు గ్రామస్థులకు తెలిపారు. బంధువులు, గ్రామస్థులు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని నీటి నుంచి బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి...