ETV Bharat / state

రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా అడ్డదారిలో ఎంపికయ్యారు: శ్రీనివాసులు రెడ్డి

TDP critism on Ramasubbareddy: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి దొంగదారిలో ఎంపికయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో రామసుబ్బారెడ్డి అడ్డదారిలో ఎంపిక చేయించుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ దిగజారీ ప్రవర్తిస్తోందన్న రామసుబ్బాయారద్దీ విమర్శలను ఆయన తిప్పిగొట్టారు.

srinivasulu reddy
srinivasulu reddy
author img

By

Published : Feb 27, 2023, 3:51 PM IST

TDP critism on Ramasubba reddy: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలతో వైసీపీ, టీడీపీ నేతలు కాక పుట్టిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి ఎంపిక కావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.. కొన్నాళ్ల క్రితం వరకు కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల్లో టీడీపీ నేతగా కీలకంగా వ్యవహరించిన రామసుబ్బారెడ్డి పార్టీ మారడంతో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్దం మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీలో నిలిచి ప్రత్యర్థి పార్టీ.. టీడీపీపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైనది.

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి దొంగదారిలో ఎంపికయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. కడపలోని పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో రామసుబ్బారెడ్డి అడ్డదారిలో విజయం సాధించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందన్న రామసుబ్బా రెడ్డి విమర్శలను ఆయన తిప్పిగొట్టారు.

పదవీ కాంక్షతోనే పార్టీ మారారు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన రామసుబ్బారెడ్డిని.. గత 30 ఏళ్ల నుంచి టీడీపీ అల్లుని వలే పోషించిందని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. పదవీ కాంక్షతో అదును చూసి పార్టీ మారిన రామసుబ్బారెడ్డి.. టీడీపీని విమర్శించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ వైసీపీకే ఉందని భావించినప్పుడు ధైర్యంగా పోటీ చేసి ఉండాల్సిందని సవాల్ విసిరారు. పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో దొంగదారిలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారన్నారు.

క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది: ముఖ్యమంత్రి జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగితే రాజకీయంగా అవమానాల పాలుకావాల్సి వస్తుందని.. వైసీపీ నేతల్లో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. స్వతంత్ర అభ్యర్థిని బలపరిచిన ముగ్గురిని ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలలో నకిలీ సంతకాలున్నాయని అధికారులచే చెప్పించి రామసుబ్బారెడ్డి ఎన్నికయ్యేలా చేశారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు తగదు : 30 ఏళ్లలో అన్ని రకాల పదవులు అనుభవించిన రామసుబ్బారెడ్డి చంద్రబాబు నాయుడు, లోకేశ్​లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ అదిష్టానం మేరకు తాము స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపినట్లు వివరించారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి రమణకు మద్దతు తెలిపామన్నారు. ఓటమి భయంతోనే రామసుబ్బారెడ్డి అడ్డదారిలో ఎన్నికయ్యారని విమర్శించారు.

ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడం సహజం : ఎన్నికలన్న తరవాత ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడం సహజం.. కడప జిల్లాలో మొన్నటి వరకూ టీడీపీకీ తలమానికంగా ఉన్న రామసుబ్బారెడ్డి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తూలనాడటంతో రాజకీయ సంవాదం మరింత ముదిరింది. జమ్మలమడుగులో పొన్నపురెడ్డి కుటుంబానికి గుర్తింపు తెచ్చిన పార్టీపైనే అసత్య ఆరోపణలు చేయడాన్ని వైఎస్సార్​ కడప జిల్లా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీలో ఉండగా దిగజారుడు కనిపించనప్పుడు ఇప్పుడు ఆరోపించడం ఎంత వరకూ సబబని టీడీపీ నేతలు ప్రతివిమర్శలకు దిగుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.