అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు.
రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు సంకల్పిస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతికి మద్దతిచ్చి... అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు.
రైల్వేకోడూరులో...
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రైల్వేకోడూరులో తెదేపా నేతలు దీక్ష చేపట్టారు. అమరావతి రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. ఆంధ్రుల కల అమరావతి అని, అమరావతిలోనే రాజధాని ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.