కడప జిల్లా బద్వేలులో అన్న క్యాంటీన్లను మూసివేతకు నిరసనగా తెదేపా శ్రేణులు నిరసనకు దిగారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని బద్వేలు తెదేపా ఇన్ఛార్జ్ డాక్టర్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను మూసివేయడం అన్యాయమని ఆర్టీసీ జోనల్ మాజీ ఛైర్మన్ ఆర్ వెంకటసుబ్బారెడ్డి అన్నారు. క్యాంటీన్‌కు ఏ పేరు పెట్టుకున్నా ఇబ్బంది లేదని క్యాంటీన్లను మాత్రం కొనసాగించాలని కోరారు.
కడప జిల్లా రాజంపేట లో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో తెదేపా కార్యాకర్తలు నిరసనకు దిగారు. అన్న క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ కు అక్షయ పాత్ర వంటిదనీ, దాన్ని మూసివేస్తే పేదల పరిస్థితి ఏంటని బత్యాల ప్రశ్నించారు. వెంటనే క్యాంటీన్లను తెరవాలని డిమాండు చేశారు. క్యాంటీన్లకు రంగులు మార్చేందుకు పేదల కడుపు మాడ్చుతున్నారని చెంగల్రాయుడు ఆరోపించారు.
ఇదీ చదవండి : 'వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది'