ETV Bharat / state

'రాజధాని తరలిస్తే... రాయలసీమకు అన్యాయం జరుగుతుంది' - రాజధానిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుంటే... జిల్లాలోని ఎమ్మెల్యేలు,ఎంపీలు నోరు మెదపటం లేదని... జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రైతులు, మహిళలపై పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని మార్పు ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శించారు.

రాజధానిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి వ్యాఖ్య
రాజధానిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి వ్యాఖ్య
author img

By

Published : Jan 12, 2020, 9:55 PM IST

రాజధానిని మార్చడం ప్రభుత్వ కుట్రలో భాగమేనన్న జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్​ రెడ్డి

రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడమే ఆరు నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయమని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే రాజధాని అమరావతి మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కడపలో నిర్వహించిన విపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్తకంఠంతో నేతల వైఖరిని స్పష్టం చేశారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజధాని మార్చడంపై నోరు మెదపడం లేదని... ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ప్రభుత్వ చీఫ్​ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జరుగుతున్న పరిణామాలు వదిలేసి గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని తరలిస్తే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రైతులు, మహిళలపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించడం అహంకార పాలనకు నిదర్శనమన్నారు. ఈ నెల 18న అన్ని పార్టీల నేతలతో రాయచోటిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీ

Intro:స్క్రిప్ట్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడమే ఆరు నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయమని తేదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు రాయచోటిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పోలవరాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిలిపి వేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే రాజధాని అమరావతి మార్పుకు శ్రీకారం శ్రీకారం చుట్టారు అన్నారు రాజధాని మార్పు ప్రాంతాలు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను అయోమయంలో పడేసింది అన్నారు రాష్ట్ర రాజధాని అమరావతి లోని కొనసాగించాలని కడప లో నిర్వహించిన విపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో లో ముక్తకంఠంతో నేతల వైఖరిని స్పష్టం చేశారన్నారు జిల్లాలోని తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు రాజధాని మార్పు పై నోరు మెదపడం లేదన్నారు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి పై మాట్లాడాలి అన్నారు రాజధాని తరలిస్తే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు మూడో రాజధానుల ఏర్పాటుకు మద్దతిస్తే ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు రాయలసీమకు ద్రోహం చేసినవారవుతారు అమరావతిలో రాజధాని కోసం విలువైన భూములు ఇచ్చిన రైతులు ఆందోళన పడుతూ ఉంటే వారిని రోడ్డు విడిచి మహిళలని కూడా చూడకుండా పోలీసు కిరాతకంగా వ్యవహరించడం రాష్ట్రంలో అహంకారి పాలనకు నిదర్శనమన్నారు కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి లో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వదిలేసి గండికోట ఉత్సవాలు డాన్సులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈ నెల 18న రాజంపేట పార్లమెంట్ అన్ని పార్టీల నేతలతో రాయచోటిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం వైఖరి మార్చుకుని రాజధాని అమరావతి లోని కొనసాగించాలని డిమాండ్ చేశారు

Body:బైట్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు కడప

Conclusion:టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి ప్రెస్ మీట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.